
ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాలలో కూడా టిడిపి చాలా బలంగా ఉండేది. కానీ ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి ఎదురే ఉండకూడదనే ఉద్దేశ్యంతో, అభివృద్ధి కోసం అంటూ కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను తన పార్టీలోకి ఫిరాయింపజేసుకొని రెండు పార్టీలను చావు దెబ్బతీశారు.
కాంగ్రెస్ పార్టీ ఆ దెబ్బల నుంచి కోలుకొని మళ్ళీ కేసీఆర్‌ను సవాలు చేయగలుగుతోంది కానీ నేటికీ టిడిపి కోలుకోలేకపోతోంది.
తెలంగాణలో టిడిపి పతనం అవడానికి కేసీఆర్ కారణమని అందరూ అనుకొంటున్నప్పటికీ అసలు కారకుడు మాత్రం ఇంటి దొంగ ఎర్రబెల్లి దయాకర్ రావు అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు పాలకుర్తి సభలో బహిరంగంగా ప్రకటించారు.
ఆనాడు ఆయన కేసీఆర్‌తో చేతులు కలిపి తనకు రాజకీయ బిక్ష పెట్టిన టిడిపిని దెబ్బతీయడమే కాకుండా, ఓటుకు నోటు కేసులో నన్ను ఇరికించి జైలుకి కూడా పంపించారని రేవంత్ రెడ్డి నేడు కుండబద్దలు కొట్టారు. నేను జైలుకి వెళ్ళడానికి కారణం ఎర్రబెల్లి దయాకర్ రావే అని విస్పష్టంగా చెప్పారు.
తన స్వార్ధ ప్రయోజనాల కోసం టిడిపిని, పార్టీలో సహచరులను కూడా దెబ్బతీసిన ఎర్రబెల్లి దయాకర్ రావుని ఈ ఎన్నికలలో ఓడించి బుద్ధి చెప్పాలని రేవంత్ రెడ్డి టిడిపి సానుభూతిపరులకు సభాముఖంగా విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో ఎన్నికలని దేశంలోకే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మార్చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీదే అని అందరికీ తెలుసు. ఈ కారణంగానే తెలంగాణలో చిన్నచిన్న రాజకీయ పార్టీలు సైతం ఎన్నికలలో పోటీ చేయలేని దుస్థితి నెలకొంది. ఇక సామాన్యులు ఏం చేయగలరు?
తెలంగాణలో రాజకీయాలను, ఎన్నికలను డబ్బు సంచుల వ్యవహరంగా మార్చేసి, ఓటుకు నోటు కేసుని భూతద్దంలో చూపిస్తూ ఆ పేరుతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని, రేవంత్ రెడ్డిని పదేపదే నిందిస్తూ ప్రజల దృష్టిలో దోషులుగా నిలబెట్టేందుకు బిఆర్ఎస్ నేతలు చేయని ప్రయత్నం లేదు.
అప్పటి నుంచే వైసీపి కూడా దానినే ఓ అస్త్రంగా చంద్రబాబు నాయుడుపై ప్రయోగిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ వేలు, లక్షల కోట్ల అవినీతిలో కూరుకుపోయినవారు ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది కదా?
అందుకే రేవంత్ రెడ్డి ఈ కేసు గురించి నేడు ఇంత ధైర్యంగా బహిరంగ సభలోనే కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పేశారనుకోవచ్చు. ఆనాడు టిడిపిని బిఆర్ఎస్ పార్టీలో విలీనం చేయమని తెలంగాణ శాసనసభ స్పీకరుకి ఎర్రబెల్లి దయాకర్ రావే లేఖ ఇచ్చిన సంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. కనుక తెలంగాణలో టిడిపి పతనానికి ఎర్రబెల్లి దయాకర్ రావే కారకుడని రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే కదా?
Anukreethy Vas makes a simple lace and denim pairing feel like a proper fashion moment.…
Today, Prime Minister Narendra Modi inaugurated the Vadapalani to Poonamallee stretch of the Phase 2…