
రానున్న రోజుల్లో ఈ ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అస్త్రాలుగా వాడుకోబోతుంది. రేవంత్ చంద్రబాబును ఏమీ అనక పోయినప్పటికీ చంద్రబాబుకు తెలిసే ఇవన్ని జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపించబోతుంది. ఒకరకంగా రేవంత్ వైఎస్ఆర్ కాంగ్రెస్కు అస్త్రాలు అందించాడు.
మరో వైపు జంప్ జిలానీల సెగ చంద్రబాబుకు కూడా తగలడంతో ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి బాగా ఆనందంగా ఉన్నట్టు సమాచారం. గత ఏడాది కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ 20 మంది ఎంఎల్ఏలను, ఇద్దరు ఎంపీలని పోగొట్టుకుంది. నిన్నగాక మొన్న మరో ఎంపీ సైకల్ ఎక్కారు.
మరింత మందితో చంద్రబాబు టచ్లో ఉన్నారని సమాచారం. ఇలాంటి సమయంలో చంద్రబాబుకు రేవంత్ రెడ్డి రూపంలో తెలంగాణాలో దెబ్బ తినడం ఒకరకంగా జగన్ కు ఆనందమే. పైగా చంద్రబాబు మీద త్రాచు పాము పగ వంటిది జగన్ పగ. ప్రజాస్వామ్యం, కోర్లు లేకపోతే చంద్రబాబును ఏంచేస్తారో జగన్ ఆల్‌రెడీ నాంధ్యాలలో చెప్పారు కూడా. కాబట్టి తెలంగాణాలో జరుగుతున్న ఈ పరిణామాలు జగన్కు ఆనందం కలిగించేవే.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…