పదేళ్ళు మేమే.. మరి కేసీఆర్‌ని చూసి భయమెందుకు?

తెలంగాణలో అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీల మద్య చాలా ఆసక్తికరమైన వాదోపవాదాలు నడుస్తున్నాయి.

ADVERTISEMENT

ఇటీవల గులాబీ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ పార్టీయే మా ప్రధాన శత్రువు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ విషయంలో ఫెయిల్ అయ్యింది. దానిని ప్రజలే గద్దె దించేస్తారు. మళ్ళీ మేము అధికారంలోకి రావడం ఖాయం. మా క్యాడర్‌ని వేధిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు, పోలీస్ అధికారులు కబడ్దార్,” అని కేసీఆర్‌ హెచ్చరించారు.

కేసీఆర్‌ విమర్శలకు సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రులు కూడా చాలా ధీటుగానే జవాబిస్తున్నారు.

“ధనిక రాష్ట్రమైన తెలంగాణని కల్వకుంట్ల కుటుంబం, బిఆర్ఎస్ పార్టీ నేతలు దోచేసుకొని చాలా ధనవంతులుకాగా , తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. తెలంగాణ వలన మీరు బాగుపడ్డారు తప్ప రాష్ట్రం, ప్రజలు బాగుపడలేదు.

అయినా కేసీఆర్‌ శాసనసభకు రాకుండా ఫామ్‌హౌస్‌లో పడుకొని ఏడాదికి రూ.65 లక్షలు జీతం, కాన్వాయ్, పోలీస్ భద్రత అప్పనంగా తీసుకుంటూ, రేయింబవళ్ళు పనిచేస్తున్న మా ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు.

కేసీఆర్‌ 40 ఏళ్ళు రాజకీయాలలో, పదేళ్ళు పదవిలో ఉన్నారు. అయినా ఇంకా తృప్తి తీరాలేదా? ఇంకా అధికార దాహమేనా?సరే నేను చేయగలిగింది ఏదో చేశాను.. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కుర్రాళ్ళకి ఓ అవకాశం ఇచ్చి చూద్దామని లేదు. నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే కూలిపోతుందని బెదిరించడం ప్రారంభించారు. కానీ పిల్లి శాపాలకు ఉట్టి తెగిపడుతుందా?మరో పదేళ్ళు మేమే అధికారంలో ఉంటాము.

గత ఏడాదిన్నరగా ఫామ్‌హౌస్‌లో పడుకుంటునందున ప్రజలు ఇప్పుడిప్పుడే ఆయనని, ఆయన చేసిన పాపాలను మరిచిపోతున్నారు. కానీ కేసీఆర్‌ మళ్ళీ బయటకు వచ్చి మానిపోతున్న వారి గాయాలను కెలికి, జనం చేత ఛీ కొట్టించుకుంటున్నారు,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ఆయన విమర్శలపై బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ, “మరో పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి అంత నమ్మకంగా చెప్పుకొంటునప్పుడు, ఫామ్‌హౌస్‌లో పడుకున్న మా కేసీఆర్‌ని చూసి ఎందుకు భయపడుతున్నారు?నన్ను ముఖ్యమంత్రిగా ఉండనీయమని కేసీఆర్‌ని బ్రతిమాలుకోవడం దేనికి?

మీ ముఖ్యమంత్రి పదవి శాశ్వితం కాదని మీకూ తెలుసు మాకూ తెలుసు.. ప్రజలకి కూడా తెలుసు. మీ అధిష్టానం మీ పదవి ఎప్పుడు పీకేస్తుందో మీకే తెలియదు. మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరు ఎప్పుడు మీ కుర్చీకి ఎసరు పెడతారో అని భయపడుతూనే ఉన్నారు. మరో పదేళ్ళు ఎలా ముఖ్యమంత్రిగా ఉంటారు?” అని జగదీష్ రెడ్డి అన్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

First Direction, Next Acting? Jason Sanjay in the Spotlight

Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…

16 minutes ago

No Relief At Supreme, But AP Set For Poll Battle

A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…

46 minutes ago