
రాజకీయాలలో ఎల్లప్పుడూ శత్రుత్వమే కాదు మర్యాదలు, సత్ సాంప్రదాయాలు, ఆనవాయితీలు కూడా పాటించడం అవసరం. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, ఒడిస్సా సిఎం మోహన్ చరణ్ మాఝీ, తమిళనాడు సిఎం విజయ్ ముగ్గురూ అటువంటి మర్యాదలు, సత్ సాంప్రదాయాలు పాటిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు.
తెలంగాణ సిఎంగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత మాజీ సిఎం తుంటి ఎముక విరిగి ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నప్పుడు సిఎం రేవంత్ రెడ్డి వెళ్ళి మర్యాదపూర్వకంగా పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
రెండేళ్ళ క్రితం ఒడిస్సాలో బిజేపి గెలిచి మోహన్ చరణ్ మాఝీ సిఎం అయిన తర్వాత మాజీ సిఎం నవీన్ పట్నాయక్ ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారు.
తాజాగా తమిళనాడు సిఎం విజయ్ మాజీ సిఎం స్టాలిన్ ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారు. సిఎం విజయ్ వచ్చినప్పుడు స్టాలిన్ కుమారుడు, (విజయ్ కాలేజీ మిత్రుడు) గేటు వద్ద ఆప్యాయంగా పలకరించి సగౌరవంగా తోడ్కొని లోనికి తీసుకువెళ్ళారు. మాజీ సిఎం స్టాలిన్ సిఎం విజయ్‌ని ఆప్యాయంగా కౌగలించుకుని ఆశీర్వదించారు. విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే స్టాలిన్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసేసిందంటూ విమర్శించారు. అప్పుడు దానికి స్టాలిన్ జవాబు చెప్పారు. కానీ ఆ తర్వాత విజయ్ భేషజాన్ని పక్కన పెట్టి వెళ్ళి స్టాలిన్ని కలవగా, ఆయన కూడా అదే స్పూర్తితో విజయ్‌ని ఆదరించి పంపారు.
మంత్రి నారా లోకేష్‌తో సహా పలువురు మంత్రులు, వివిధ రాష్ట్రాల నేతలు ఇటువంటి సత్సంప్రదాయాలను పాటిస్తుంటారు.
జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సిఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను అమితంగా ద్వేషించే మాజీ సిఎం చంద్రబాబు నాయుడుని కలవలేదు. కానీ హైదరాబాద్ వెళ్ళి తాను సిఎం అయ్యేందుకు తోడ్పడిన తెలంగాణ సిఎం కేసీఆర్‌ని కలిశారు. ఆ సందర్భంగా కేసీఆర్ కూడా జగన్‌ని ఇలాగే ఆప్యాయంగా కౌగలించుకున్నారు. కేటీఆర్, జగన్ కూడా అన్నదమ్ముల్లా వ్యవహరిస్తారు. కానీ వారి స్నేహం, బంధం వారి పార్టీల పరంగా సహకరించుకునేందుకు పనికి వచ్చింది కానీ రాష్ట్రాలకు ఉపయోగపడలేదు.
కేటీఆర్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడే కాస్త హుందాగా మాట్లాడేవారు. కానీ ప్రతిపక్షంలోకి మారిన తర్వాత అయన స్వరంలో చాలా మార్పు వచ్చింది. సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి చాలా చులకనగా మాట్లాడుతున్నారు. కనుక అందుకు తగిన జవాబులు కూడా లభిస్తూనే ఉన్నాయి.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…