రేవంత్ తేల్చేశారు.. చంద్రబాబు ఏం చెప్తారో?

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి పైకి కనబడిన్నట్లు మెతక మనిషి కాదని ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. నేడు తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులతో సమావేశమైనప్పుడు మరోసారి నిరూపించుకున్నారు. సినీ పరిశ్రమ జనాలకు సినిమా చూపిస్తే, ఆయన వారికే సినిమా చూపించారు.

ఈరోజు ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వారితో సమావేశమైనప్పుడు మొదట వారందరూ చెప్పింది చాలా సావధానంగా విన్నారు.

ADVERTISEMENT

తర్వాత సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట వీడియోని, థియేటర్‌లో నుంచి అల్లు అర్జున్‌ని పోలీసులు బయటకు తీసుకువస్తున్న సీసీ టీవీ ఫుటేజీలను చూపించి సినీ ప్రముఖులను సంజాయిషీ అడిగారు. తప్పు జరిగిన్నట్లు స్పష్టంగా తెలిసి ఉన్నా ఎవరూ ఎందుకు స్పందించలేదని సిఎం రేవంత్ రెడ్డి వారిని అడిగిననట్లు తెలుస్తోంది.

కనుక శాసనసభలో ప్రకటించిన్నట్లుగానే ఇకపై ప్రివిలేజ్ షోలు, బెనిఫిట్ షోలకు, టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతించే ప్రసక్తేలేదని సిఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పిన్నట్లు సమాచారం.

అలాగే సినిమా హీరోల బౌన్సర్స్ విషయంలో ఇకపై చట్ట ప్రకారమే వ్యవహరిస్తామని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన్నట్లు తెలుస్తోంది.

మాదక ద్రవ్యాల నియంత్రణ, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న వివిద అభివృద్ధి, సంక్షేమ పధకాలకు సంబందించి సినీ నటీనటులతో ప్రకటనలు రూపొందించి, సినిమా ప్రదర్శనకు ముందు తప్పనిసరిగా ప్రదర్శించాలని సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన్నట్లు తెలుస్తోంది.

అయితే ఇన్ని షరతులు విధించి, సినీ పరిశ్రమతో తమ ప్రభుత్వానికి ఎటువంటి శతృత్వం లేదని, ఎప్పటిలాగే సహకరిస్తుందని సిఎం రేవంత్ రెడ్డి చెప్పడం విశేషం.

తెలంగాణలో సినీ పరిశ్రమ జాతకం ఏవిదంగా ఉండబోతోందో రేవంత్ రెడ్డి చెప్పేశారు. మరి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కూడా అదే ఫార్ములా అమలు చేస్తారా?లేదా ప్రివిలేజ్ షోలకు అనుమతి నిరాకరించి, బెనిఫిట్ షోలకు, టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతిస్తారా? అంటే కొన్ని అంశాలు పరిగణనలోకి తీసుకొని నిర్ణయించాల్సి ఉంటుంది.

తెలంగాణ ప్రజలతో పోలిస్తే ఏపీ ప్రజలకు సినిమాలంటే చాలా పిచ్చి.. ప్రేమ. అలాగే సినీ ప్రముఖలకు, సిఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లకు బలమైన సత్సంబంధాలున్నాయి.

సిఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమని ఏపీకి పంపించేయాలనే వేధిస్తున్నారంటూ బీజేపి ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ సంచలన ఆరోపణ చేశారు.

రేవంత్ రెడ్డికి ఆ ఉద్దేశ్యం ఉన్నా లేకపోయినా ఏపీకి సినీ పరిశ్రమని రప్పించాలంటే ఇదీ ఒక మంచి అవకాశమే. కనుక కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఇండి కూటమి ‘యాంటీ’ ఇండియా రాజకీయం చేస్తుందా.?

గత కొన్ని రోజులుగా బీజేపీ టార్గెట్ గా ముఖ్యంగా మోడీ కార్నర్ గా ఢిల్లీ వేదికగా జరుగుతున్న కాక్రోచ్ల రాజకీయం,…

25 minutes ago

Amaravati Railway Line Likely by 2028-29, Tenders Progress

Amaravati could get railway connectivity by late 2028 or early 2029 through a 57-km railway…

25 minutes ago