
రాంగోపాల్ వర్మ తన ట్వీట్ లో షర్మిళ కి రాజకీయ అవగాహన లేని వ్యక్తిగా, అపరిపక్వత కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు. షర్మిళ ఒక ఉన్నతమైన రాజకీయ కుటుంబం నుండి వచ్చారని, ఆమె ఒక పార్టీకి అధ్యక్షురాలని, వివేకా హత్యపై కొంచెం కూడా అవగాహన లేకుండా మాట్లాడటం తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆర్జీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
వివేకా హత్యపై షర్మిళ చేసిన వ్యాఖ్యలు, మరీ ముఖ్యంగా వివేకా తన ఆస్తులను ఎప్పుడో తన కుమార్తె సునీత పేరు మీద రాశారని, తండ్రిని ఆస్థి కోసం హత్య చేయాల్సిన అవసరం సునీతకు ఎందుకు ఉంటుంది అని షర్మిళ చేసిన వ్యాఖ్యలు కనీస అవగాహలేకుండా చేసిన వ్యాఖ్యలుగా ఆర్జీవి అభివర్ణించారు.
సునీత పేరు మీద ఆస్థులు బదలాయించి వీలునామా రాయడం చేశాక సునీతకు వివేకాను హత్యచేయించాల్సిన అవసరం ఏముంటుంది అని షర్మిళ చెప్పడం సరికాదన్నారు. ఆ వీలునామాను వివేకా రెండవ భార్య అయిన షమీమ్ పేరు మీదకు బదలాయించడానికి అవకాశం ఉంది కదా అనే కోణంలో ఆర్జీవి ట్వీట్ చేశారు. షమీమ్ ని వివేకా పెళ్లిచేసుకోవడాన్ని సునీత వ్యతిరేకించిన విషయం కూడా ఆర్జీవి ప్రస్తావించారు.
ఒక వేళ వివేకా తనకున్న ఆస్థిని రెండవ భార్య షమీమ్ పేరుకు బదలాయించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సునీతకు సమాచారం ఉండటమే, లేక అనుమానం రావడం వల్ల కూడా వివేకాను అడ్డు తొలగించుకునే ప్రయత్నం కూడా చేసి ఉండి ఉండవచ్చు కదా అనే కోణంలో కూడా ఆర్జీవి తన అనుమానాన్ని వ్యక్తపరిచారు. ఏదిఏమైనా అసలు నిజం సీబీఐ తేల్చాలికదా అని ఆర్జీవి అన్నారు.
ఆర్జీవి తాను వ్యక్తపరిచిన అనుమానానికి ఊతాన్ని ఇస్తూ గతంలో బీఎస్పీ యం.పి దీపక్ భరద్వాజ్ హత్య జరిగిన తీరును ప్రస్తావించారు. దీపక్ ని ఆస్థి కోసం తన సొంత కొడుకే హత్యచేసినట్లుగా ఓ ఆంగ్ల వైబ్ సైట్ ప్రచురించిన కథనం యొక్క లింక్ ని ఆర్జీవి తన ట్వీట్ తో పాటు షేర్ చేశారు.
Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…
Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…