ఆర్ఆర్ఆర్ కు అత్యంత కీలకం

Roar Of RRR releaseఆర్ఆర్ఆర్… బాహుబలి వంటి సెన్సషనల్ సక్సెస్ తరువాత రాజమౌళి చేస్తున్న తరువాతి సినిమా. సహజంగా అటువంటి సినిమా మీద ఎక్కువ అంచనాలు ఉంటాయి. పైగా ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు. నీరు, నిప్పులా ఉండే ఇద్దరు స్టార్ హీరోలను అదే థీమ్ తో సినిమా తీస్తున్నాడు రాజమౌళి.

ADVERTISEMENT

ఇప్పటివరకు సినిమాకు సంబంధించి కొన్ని పోస్టర్లు.. రెండు టీజర్లు బయటకు వచ్చాయి. అయితే అందులో ఏవీ కూడా బాహుబలి రేంజ్ లో లేవనే చెప్పుకోవాలి. దానితో ఈ సినిమాకు సహజంగా రాజమౌళి సినిమాల మీద ఉండే… లేదా ఉండాల్సిన హైప్ లేదనే చెప్పుకోవాలి.

ఈ తరుణంలో శుక్రవారం నాడు రోర్ అఫ్ ఆర్ఆర్ఆర్ పేరిట సినిమా మేకింగ్ వీడియో విడుదల చేస్తున్నాడు జక్కన్న. ఒకరకంగా అది రాజమౌళికి ఈ సినిమాకు చాలా కీలకమనే చెప్పుకోవాలి. ఈ మేకింగ్ వీడియో గనుక రాజమౌళి స్థాయిలో ఉందని అనిపిస్తే ఆ హైప్ దాని అంతట అదే పెరుగుతుంది.

ఒకవేళ అందుకోకపోతే ఆ అవకాశం ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదు. టీజర్… ట్రైలర్ల రిలీజ్ ఇప్పట్లో ఉండదు. రిలీజ్ దగ్గరలోనే అవి బయటకు వస్తాయి. అందుకే ఈ శుక్రవారం రాజమౌళికి ఎంతో కీలకం. మరోవైపు… సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ మీద రేపు క్లారిటీ వస్తుందేమో చూడాలి.

ఇప్పటివరకు సెకండ్ వేవ్ తరువాత విడుదలైన పోస్టర్ల మీద అక్టోబర్ 13 అనే ఉంది రిలీజ్ డేట్. అయితే ఫ్యాన్స్ తో సహా ఎవరు దీనిని నమ్మడం లేదు. ఒకవేళ వీడియోలో కూడా అదే తేదీ ఉంటే ఆలోచించాల్సిందే!

ADVERTISEMENT
Latest Stories