
ఇటీవలే ముగిసిన 2024 టి-20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకున్న భారత్, కప్ ను ముద్దాడక ముందే విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ ల వంటి దిగ్గజాలు టి-20 ఫార్మటు కు గుడ్ బాయ్ చెప్పారు. వారి వెంబడే రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ముగియడంతో,జట్టు కు అన్ని విభాగాల్లోనూ స్పష్టమైన ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. కానీ, ఐపీఎల్ వలన యువ కీర్తి ప్రజ్వలించటం తో టీం లో ఆ దిగ్గజాల లోటు ను భర్తీ చేసే యువ క్రికెటర్లు పుట్టుకొచ్చారు.
తాజాగా, జట్టు కోచ్ పదవి భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు అందించింది బీసీసీఐ. దూకుడు శైలి తో ఉండే గౌతమ్ గంభీర్ పై కోచ్ గా అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అనుకున్నట్టే కోచ్ గా పగ్గాలందుకోగానే ఒక భారీ మార్పు కు శ్రీకారం చుట్టారు. రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ కాబోతున్నాడు అనుకున్న హార్దిక్ ను కాదని, వరల్డ్ నెంబర్ 1 టి-20 బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ కు 33 ఏళ్ళ వయసులో పొట్టి ఫార్మట్ పగ్గాలను అందజేశారు.
30 ఏళ్లకు ఇంటర్నేషనల్ క్రికెట్ కు అరంగేట్రం చేసిన సూర్య కు టి-20 ఫార్మట్ లో నిలదొక్కుకునేందుకు పెద్ద సమయమేమి పట్టలేదు. మొదటి బంతి నుండే తన దూకుడు శైలి తో బాటింగ్ చేస్తూ వీక్షకులను అబ్బుర పరిచే షాట్ ల తో యావత్ క్రికెట్ ప్రపంచాన్నే
తన వైపు మళ్లించుకుంటారు సూర్య. సౌత్ ఆఫ్రికా దిగ్గజం ఏ.బి.డే విల్లియర్స్ వంటి ఒక 360 డిగ్రీస్ ఆటగాడిగా సూర్య కు చాల కొద్ది కాలం లో నే గుర్తింపు దొరికింది.
అటు చూస్కుంటే, వన్ డే ఫార్మటు కు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ, కొత్త కోచ్ గంభీర్ కోరిక మేరకు జట్టు లో భాగమయ్యారు. యధావిధిగా రోహిత్ కెప్టెన్సీ పగ్గాలను అందుకున్నారు. అయితే హార్దిక్ పాండ్య ఈ వన్ డే సిరీస్ కు అందుబాటు లో లేరు. అయినా జట్టు లో కే.ఎల్.రాహుల్ వంటి సీనియర్ ఆటగాడు ఉన్నపటికీ కూడా, శుభమన్ గిల్ వంటి యువకుడికి వైస్ కెప్టెన్సీ పగ్గాలను అందించింది బీసీసీఐ యాజమాన్యం.
ఇటు టి-20 ఫార్మటు లో నూ పాండ్య,పంత్ వంటి సీనియర్లు ఉన్నా, మళ్ళీ గిల్ కే వైస్ కెప్టెన్సీ ని అందించారు. దీని బట్టి, భవిష్యత్ కాలం లో భారత జట్టుకు బీసీసీఐ , గిల్ నే కెప్టెన్ చెయ్యాలని చూస్తున్నట్లు స్పష్టమవుతుంది. అయితే, ఇటీవలే ముగిసిన జింబాంబే సిరీస్ లో రుతురాజ్ చక్కగా ప్రదర్శించినప్పటికీ, అతనికి ఛాన్స్ ఇవ్వలేదు బీసీసీఐ. అలాగే వన్ డే మరియు టి-20,రెండింటిలోనూ అతనిని ఎంపిక చేయలేదు బీసీసీఐ.
ఇక 2026 లో జరిగే టి-20 వరల్డ్ కప్ వరుకు సూర్య నే భారత జట్టు పొట్టి ఫార్మటు సారధి గా ఉంటారంటూ తేల్చి చెప్పేస్తున్నాయి మీడియా సంస్థలు. హార్దిక్ కు ఫిట్నెస్ ఇబ్బందులు ఉండటమే కెప్టెన్సీ కోతలో ప్రధాన కారణంగా చెప్తున్నారు. అయితే ఇటు సూర్య, కేవలం టి-20 స్పెషలిస్ట్ కనుక జట్టు యాజమాన్యం సూర్య వైపే మొగ్గు చూపారు. చూడాలి మరి, శర్మ సేవలు ముగిశాక,సారధి అయిన సూర్య కు సమస్యలేమీ లేకుండా, జట్టు ను ముందుకు నడిపించి అనుకున్న ఫలితాలు తేవటం లో సఫలమవుతారా అని..?
Vijay Deverakonda is confident about his comeback with Ranabaali and has a strong message for…
YS Jagan has been very successful when it comes to mitigating the legal and judicial…