
పవన్ కళ్యాణ్ తరపున బండ్ల గణేష్ ని కూర్చోబెట్టగా రోజాని ఫోన్ లైన్లోకి తీసుకున్నారు రజినీకాంత్. ఒకదశలో పవన్ కళ్యాణ్ ని ఏకవచనంతో సంబోదించడంతో వారించిన బండ్ల గణేష్ తొందరగానే నోరుపారేసుకున్నారు. రోజాది ఐరన్ లెగ్ అంటూ రాజశేఖర రెడ్డిని పైకి పంపించావు అంటూ నగిరి ఎమ్మెల్యేను తూలనాడారు.
తనేమన్న తక్కువ అంటూ రోజా నువ్వు పవన్ కళ్యాణ్ కి పక్కలేస్తావా అంటూ హేయంగా మాట్లాడటంతో బండ్ల రెచ్చిపోయి “అవును నిన్నూ పడుకోబెడతా” అన్నాడు. పళ్లు రాలిపోతాయ్ అని రోజా.. నీ పళ్లు రాలగొడతా అంటూ బండ్ల గణేష్ సభ్యసమాజం సిగ్గుపడేలా ఒకరిమీద ఒకరు వీరంగం ఆడారు.
మెరుగైన సమాజం కోసమంటూ గొప్పలు చెప్పే టీవీ9 ఇదంతా లైవ్ టెలికాస్ట్ చేసి ఎప్పటిలానే తన ప్రత్యేకత చాటుకుంది. ఇటువంటి మాటలు అటు రోజాకు, బండ్ల గణేష్ కు, ఇటు టీవీ9కు కొత్తేమి కాకపోయినా చూసేవారికి మాత్రం జుగుప్సగా అనిపించక మానదు. 2019 ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ఇంకెన్ని సిత్రాలు చూడాలో!
Thrigun Eashwaran is one reason many audiences are watching this year's Bigg Boss season. However,…
Hyderabad is covered in advertisements, but GHMC is struggling to collect the money from them.…