
అవును. ఈ మాట అన్నది ఆయనను ద్వేషించే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “నేను చంద్రబాబు నాయుడుని అభినందిస్తున్నా. యస్! నిజంగానే నేను ఆయనను అభినందిస్తున్నా.
ఆయన కృష్ణా గోదావరి నీటిని ఎత్తిపోసుకున్నందుకు ఆయనను అభినందిస్తున్నా. ఆంధ్రాలో వర్షాభావ పరిస్థితులున్నా ఏపీ ప్రభుత్వం క్రాప్ హాలీడే ప్రకటించలేదు. ఆ రాష్ట్రంలో ఎక్కడా కరువు లేదు. కుప్పం వరకు నీటిని పారించుకుంటున్నారు. రైతులకు ఎంతో మేలు చేస్తున్నారు.
ఇందుకు ఆయనను మనస్పూర్తిగా అభినందిస్తున్నా. ఆంధ్రాలో కరువు లేదు. కానీ ఎగువనున్న తెలంగాణ గుండా కృష్ణ గోదావరి నదులు పారుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడిచిపెట్టేస్తోంది. అందుకే తెలంగాణ కరువు నెలకొంది.
ఇది ప్రకృతి సృష్టించిన కరువు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కరువు ఇది,” అంటూ తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేసారు.
కేసీఆర్‌తెలంగాణ సిఎంగా ఉన్నప్పుడు ఏవిధంగా తన రాష్ట్రానికి, రైతులకు నీళ్ళు అందించాలనుకున్నారో, అదేవిధంగా సిఎం చంద్రబాబు నాయుడు కూడా అనుకున్నారు.
అయితే కేసీఆర్ కాళేశ్వరం కడితే అది ఇంజనీరింగ్ మార్వెల్.. నభూతో నభవిష్యతి.. దాని కోసం అయన చిత్ర పటాలకు పాలాభిషేకాలు.
అదే.. తెలంగాణ దిగువనున్న ఆంధ్రలో సిఎం చంద్రబాబు నాయుడు కడితే, ‘తెలంగాణ నీటి దోపిడీ’ కోసం కడుతున్న ప్రాజెక్టులని హరీష్ రావు, కేటీఆర్ వాదిస్తుంటారు. అవేమీ మనకు కొత్త కాదు. కానీ వారి అధినేత కేసీఆర్ ఇచ్చిన ఈ లైన్ ప్రకారమే వాదిస్తూ చివారఖరున ఇప్పుడు అదే నోటితో సిఎం చంద్రబాబు నాయుడుని ఈవిధంగా పొగడాల్సి రావడం దేవుడి స్క్రిప్ట్ కాకపోతే మరేమిటి?
Chiranjeevi has spent decades in Indian cinema, building a connection with audiences across generations. The…
Ram Charan had been very unconventional with his choice of directors, and this was already…