
అలాగే నెగటివ్ ఆంగ్లేయుల పాత్రలలో ఇద్దరిని పరిచయం చేశారు. రేయ్ స్టీవెన్సన్ స్కాట్ అనే పాత్రలో, అదే విధంగా అలిసన్ డూడీ లేడీ స్కాట్ పాత్రలో నటించబోతున్నారు. ఇవి రెండు నెగటివ్ పాత్రలే అని చిత్రబృందం తెలిపింది. అలిసన్ డూడీ ఇప్పటికే చిత్ర షూటింగ్ పాల్గొనగా, ఒలీవియా మోరిస్, రేయ్ స్టీవెన్సన్ షూటింగ్ మొదలుపెట్టాల్సి ఉంది.
జులై 30, 2020న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తి అయ్యిందని చిత్రబృందం చెప్పుకొచ్చింది. 30% షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్న సినిమాలో రెండు పాత్రలు కొత్తగా ఎంటర్ కావాల్సి ఉంది.
అలాగే ఇప్పటికే చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ నటులు అలియా భట్, అజయ్ దేవగన్ షూటింగ్ మొదలు పెట్టలేదు. అంటే 30% లో వీరి పాత్రలు ఏ మేర ఉంటాయి? ఈ పాత్రలన్నీ చిన్నవే అయితే అది నిరుత్సాహపరచేదే. నిజంగానే సినిమా 70% పూర్తి అయ్యిందా? సినిమా రిలీజ్ డేట్ గురించి చిత్రబృందం ఎటువంటి ప్రకటనా చెయ్యలేదు. దీనితో అభిమానులలో చాలా అనుమానాలు ఉన్నాయి.
Union Minister and Karimnagar MP Bandi Sanjay’s son Bandi Bhageerath had been in the news…
The trailer for Dharma Productions' upcoming film Chand Mera Dil has been dropped and it…