Telugu

టాలీవుడ్ పై ఆర్ఆర్ఆర్ పిడుగు

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మల్టీస్టారర్ చిత్రం… ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. గతంలో ఈ సినిమా జులై 30న విడుదల కానున్నట్టు ప్రకటించారు. అయితే ఆ తరువాత దసరాకు రావొచ్చు అన్నారు. మొత్తానికి విడుదల పై సినీ బృందం ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది.

వచ్చే ఏడాది జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి సందర్భంగా సినిమా విడుదల చెయ్యనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఇది తెలుగు ఇండస్ట్రీ పెద్ద సినిమాల మీద పిడుగు లాంటి వార్త అనే చెప్పుకోవాలి. ఈ ఏడాది సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు కలిపి దాదాపుగా 500 కోట్ల షేర్ రాబట్టాయి. ఆర్ఆర్ఆర్ వంటి సినిమా ఎప్పుడు వచ్చినా భారీగా వసూళ్ళు రాబడుతుంది. అయితే మిగతా సినిమాలకు మాత్రం సంక్రాంతి అడ్వాంటేజ్ అవసరం. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సంక్రాంతి కి రావడం వల్ల అది నష్టపోతారు.

ADVERTISEMENT

ఇప్పుడు అటువంటి సీజన్ ను పూర్తిగా ఆర్ఆర్ఆర్ కు వదిలి పెట్టాల్సి రావొచ్చు. ఇక పోతే సంక్రాంతికి బాలీవుడ్ నుండి ఏక్ విలన్ 2 సినిమా ఉంది. సంక్రాంతికి కోలీవుడ్ నుండి ఒక పెద్ద స్టార్ సినిమా ఉండడం ఖాయం. దీనితో మిగతా పరిశ్రమలలో ఆర్ఆర్ఆర్ కు పోటీ తప్పని పరిస్థితి.

అయితే ఈ సారి ఎక్కువగా టాలీవుడ్ మార్కెట్ నే జక్కన్న టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. వారి వారి పోరాటాలకు ముందు వారు ఢిల్లీలో కలిసినప్పుడు ఏం జరిగి ఉంటుంది అనే ఊహాజనిత స్టోరీ… ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన ఒక హాలీవుడ్ తార కనిపించబోతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Tragic Hyd ORR Accident Kills Young Telugu Actor

The Telugu film industry was left shocked after a tragic road accident in Hyderabad claimed…

20 minutes ago

Koratala Siva Launches Nara Rohith’s RN23

Rohith Nara has always been recognized for his penchant for unique scripts and diverse character…

28 minutes ago