Telugu

రూలర్ టీజర్… రొటీన్ మాస్?

నందమూరి బాలకృష్ణ – జైసింహా ఫేమ్ కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం ‘రూలర్’ డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల అవుతుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ కాసేపటి క్రితం విడుదల అయ్యింది. బాలయ్య ఖాతాలో మరో రొటీన్ మాస్ మసాలా సినిమాలా ఉంది. టీజర్ మొత్తం మాస్ బ్లాక్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో నింపేశారు.

అయితే సినిమాలో ఇప్పటివరకు మైనస్ గా భావించినవి టీజర్ లో మరో సారి దర్శనం ఇచ్చాయి. పోలీసు గెట్ అప్ లో బాలయ్య హెయిర్ స్టైల్ అసలు బాలేదు. ముఖ్యంగా కాప్ పెట్టుకున్న షాట్స్ లో. బాలయ్య చెప్పిన సింహం డైలాగు అదిరిపోయింది. జైసింహా మాదిరిగానే సినిమా మొత్తం చాలా మంది ఆర్టిస్టులతో నింపేశాడు దర్శకుడు.

ADVERTISEMENT

అయితే సరైన మాస్ సినిమా పడి చాలా రోజులు అయ్యింది. ఆ సెగ్మెంట్ ప్రేక్షకులు చాలా కాలం ఆకలిగా ఉన్నారు. వారిని ఆకట్టుకునే అంశాలు చొప్పించి, కనీసం పర్లేదు అనే కథ ఉంటే… క్రిస్మస్ సీజన్ లో బీ,సి సెంటర్ ప్రేక్షకులను అక్కట్టుకోవచ్చు. చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.

మరోవైపు సాయి ధరమ్ తేజ్ – మారుతిల ప్రతి రోజు పండగే కూడా డిసెంబర్ 20నే విడుదల కాబోతుంది. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, భూమిక చావ్లా, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలయ్య వందవ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణికి స్వరాలు కూర్చిన చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా.. రామ్‌ప్రసాద్ కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Will Sithara Dare a Suriya vs Rajinikanth & Aamir Khan Clash?

One issue becoming impossible to ignore in the cinema industry is the growing fear surrounding…

31 minutes ago

ఈ విషయంలో కూడా విజయ్ ని జగన్ తో పోలుస్తారా.?

తమిళనాడు ఎన్నికల ఫలితాల తరువాత విజయ్ టీవీకే పార్టీ గెలుపును ఆ పార్టీ అభిమానులు జరుపుకున్న దానికంటే కాస్త అధికంగానే…

32 minutes ago