Telugu

మెగాహీరోతో “సంథింగ్… సంథింగ్…” నడుపుతున్న బ్యూటీ?

రెజీనా అంటే అందం, అభినయం ఉన్నా అదృష్టం లేని కధానాయికగా సినీ ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపు. ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమైనా అందుకనే పెద్ద హీరోల సినిమాల అవకాశాలు రాలేవన్నది సినీ వర్గాల మాటలు. అయితే, రెజీనా అదృష్టాన్ని మార్చాలని ఒక మెగా హీరో కంకణం కట్టుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

“పిల్లా నువ్వులేని జీవితం” సినిమాతో తెలుగు తెరపై తన అదృష్టాన్ని నిరూపించుకోవడానికి వచ్చిన మెగా వారసుడు సాయిధరంతేజ్, తనకు జతగా నటించినటువంటి రెజీనాను స్టార్ హీరోయిన్ గా మార్చాలనుకుంటున్నాడంట. కమర్షియల్ గా ఆ సినిమా విజయవంతం అయినప్పటికీ, దాని వలన రెజీనాకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేకపాయే..!

ADVERTISEMENT

అయితే, సినీ అవకాశాలను ఆశించిన విధంగా పొందలేకపోయినా… ఆ సినిమా ద్వారా రెజీనాకు అనుకోని అదృష్టం కలిసొచ్చిందని.., “పిల్లా నువ్వులేని జీవితం” సినిమా షూటింగ్ సమయంలోనే రెజీనా – సాయిధరంతేజ్ ల మధ్య ‘సంథింగ్… సంథింగ్…’ జరుగుతుందన్నట్లుగా వార్తలు వచ్చాయి. దాన్ని బలపరిచినట్లుగా సాయి తదుపరి సినిమా “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్”లో మళ్ళీ రెజీనానే దర్శనమిచ్చింది.

దీంతో వీళ్ళిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని… దానికి కారణం, ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగా కుదరడం వల్లనే అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకున్నాయి. అయితే తామిద్దరి మధ్య ఏది లేదని, కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని రెజీనా రొటీన్ డైలాగ్ చెప్పుకొచ్చింది. కానీ లేటెస్ట్ గా మరోసారి ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది.

సాయిధరంతేజ్ తాజా చిత్రంలో ఇద్దరు కధానాయికలకు అవకాశం ఉండగా, ప్రధాన హీరోయిన్ గా రెజీనా అయితే బాగుంటుందన్న సూచనలు, సలహాలు ఇస్తున్నారట. అలాగే మరో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి పేరును కూడా చిత్ర దర్శకుడికి సూచనలు చేసినట్లుగా ఇండస్ట్రీ టాక్. దీంతో సాయిధరంతేజ్ – రెజీనాల మధ్య “సంథింగ్… సంథింగ్…” నిజమే అయి ఉంటుందని, మెగా ఫ్యామిలీ అండ సంపాదిoచుకోగలిగితే రెజీనా అదృష్ట రేఖలు మారిపోవడం ఖాయమనే మాటలు సినీవర్గాల్లో సందడి చేస్తున్నాయి.

Share
Published by

Recent Posts

Sardar 2: Can Karthi Survive the Deadly Mandaadi Clash?

Following the terrible failure of Vaa Vaathiyaar, Karthi is all set to return with his…

14 minutes ago

Akshay Kumar’s KBC Blunder: Did He Forget Prithviraj?

Akshay Kumar is facing criticism on social media after an unexpected moment on Kaun Banega…

44 minutes ago