
ఎన్టీఆర్, చెర్రీలు ఇద్దరూ అన్నదమ్ములు అని, వీరిద్దరూ బాక్సర్లుగా నటిస్తున్నారని… ఇలా వారానికొకటి పుట్టుకొస్తున్న తరుణంలో… మరి మళ్ళీ మండే వచ్చింది కదా… దీంతో సరికొత్త రూమర్ కూడా రెడీ అయ్యింది. ఈ సారి టార్గెట్ హీరోయిన్ ఎంపికపై పడింది. అవును… ఇద్దరు హీరోలు ఉన్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ ఎంపిక అయ్యిందనేది లేటెస్ట్ రూమర్.
ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన అను ఇమ్మానుయేల్ ను ఈ భారీ మల్టీస్టారర్ సినిమాలో ఒక హీరోయిన్ గా ఎంపిక చేసారనేది లేటెస్ట్ న్యూస్. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక దీనిని ప్రచురించడంతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యత లభించింది. అయితే ఇది కేవలం ఒక రూమర్ గా మిగిలిపోతుందో లేక కార్యరూపం సిద్ధించుకుంటుందో లేదో తెలియాలంటే… మరికొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే..!
Akshay Kumar is set to reunite with Priyadarshan for another film, but unlike their usual…
Ee Nagaraniki Emaindi was not a big box-office success when it was released in 2018.…