
కానీ మహేష్ కమిట్మెంట్స్ ను పరిశీలిస్తే… మరో మూడు, నాలుగేళ్ల వరకు సాధ్యమయ్యే విషయంలా కనపడడం లేదన్నది లేటెస్ట్ ట్రేడ్ న్యూస్. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ‘స్పైడర్’ షూటింగ్ లో పాల్గొంటున్న ప్రిన్స్, తదుపరి ‘భరత్ అనే నేను’ లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ కాగా, జనవరి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో గానీ, త్రివిక్రమ్ డైరెక్షన్ లో గానీ ప్రిన్స్ చేయబోతున్నారనేది పక్కా న్యూస్.
రాజమౌళి అయితే ఎన్నేళ్ళు తీసుకుంటారో చెప్పలేం గానీ, త్రివిక్రమ్ అయితే ఒక సంవత్సరం ఫిక్స్. ఆ తర్వాత అయినా జక్కన్న సినిమా ఖాయం గనుక, ఇంకో ఏడాది వేసుకున్నా, మూడేళ్ళు అలా ప్రిన్స్ షెడ్యూల్స్ ఫుల్ బిజీ అన్నది మాత్రం స్పష్టం. కాబట్టి ప్రస్తుతం హల్చల్ చేస్తున్న బోయపాటి మ్యాటర్ మరో రెండు, మూడేళ్ళు పేపర్ కే పరిమితమయ్యే సూచనలే కనపడుతున్నాయి తప్ప, పట్టాలేక్కే అవకాశాలైతే తక్కువే. ఇదిలా ఉంటే, ‘స్పైడర్’ ఫలితం తేలిన తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ మహేష్ తో మరో సినిమాను నిర్మించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
The Irumudi team had plenty to celebrate as the film’s extraordinary theatrical run continues, with the movie…
ఈ మధ్య రాజకీయాలలో అధికారంలో ఉంటే తప్ప అసెంబ్లీ కి వెళ్ళేది లేదు అనే ఒక వింత సంస్కృతీ మొదలయ్యిందనే…