
టాలీవుడ్, కోలీవుడ్ లలో టాప్ హీరోయిన్ గా చలామణి అయిన త్రిష అనారోగ్యానికి గురైందని, ఇందు నిమిత్తం హైదరాబాద్ లోని ఓ సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ లో సైలెంట్ గా చికిత్స పొందుతోందన్న వార్తలు గుప్పుమన్నాయి. అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేసిన ఈ వార్తపై ఆరా తీయడానికి, హైదరాబాద్, మద్రాసులోని వివిధ పత్రికా కార్యాలయాలకు ఫోన్లు వెల్లువెత్తాయి. త్రిష ఆసుపత్రిలో చేరిందా? అంటూ పలువురు ప్రశ్నించడం ప్రారంభించారు.
ఈ పరిణామాలతో మీడియా ప్రతినిధులు త్రిషను సంప్రదించే ప్రయత్నం చేయగా, ఆమె అందుబాటులోకి లేకపోవడంతో, మరింత బలం చేకూరినట్లయ్యింది. అయితే చివరికి త్రిష తల్లి ఉమా కృష్ణన్ ను సంప్రదించగా, అవన్నీ కేవలం పుకార్లేనని, త్రిష క్షేమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆమె మలేషియాలో ప్రముఖ కోలీవుడ్ నటుడు అరవింద స్వామికి జతగా రూపొందుతున్న “సతురంగవెట్టై-2” సినిమా షూటింగ్ లో బిజీగా ఉందని చెప్పడంతో, ఉత్కంఠ వీడింది.
మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…
The inevitable has happened as Konda Surekha has been removed from the Telangana cabinet by…