
మరి దీని వెనుక ఉన్న ట్విస్ట్ ఏమిటన్నది సినిమా విడుదలైతే గానీ తెలియదు గానీ, అంతకుముందుగానే అసలు ఎందుకు చంపాడు? అన్న దానికి రకరకాల ఊహాగానాలు తెరపైకి రావడం సహజమే. కట్టప్పను బ్లాక్ మెయిల్ చేసి భళ్ళాలదేవుడే ఈ పని చేయించి ఉంటారనేది గత ఏడాది కాలంగా హల్చల్ చేస్తోన్న ఒక అంశం. అయితే అసలు కట్టప్ప చంపి ఉండరని, ఇందులో ఏదో మతలబు ఉందని, ఖచ్చితంగా రాజమౌళి మార్క్ ట్విస్ట్ ఉంటుందని… తాజాగా ట్రైలర్ విడుదలైన తర్వాత వస్తున్న భావనలు.
ఇవన్నీ ఇలా ఉంచితే… ఇదే ప్రశ్న రాజమౌళిని అడిగితే… అవును… ఖచ్చితంగా ఎవరి ఊహాగానాలు వారికి ఉంటాయి. ఒకవేళ ఎలాగైనా సమాచారం లీక్ అయినా గానీ అందులో తమకు వచ్చిన ఇబ్బంది లేదు. సిల్వర్ స్క్రీన్ పైన మనం ఎంత ఆసక్తికరంగా దానిని చూపించాము అన్నదే కీలకం అవుతుంది తప్ప, సదరు ప్రశ్న హైలైట్ కాబోదు అని రాజమౌళి స్పష్టం చేసారు. దీంతో ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అన్న దానిపై రాజమౌళి పెద్దగా ఫోకస్ చేయలేదు గానీ, ఏ పరిస్థితుల్లో చంపాడు అన్న దానినే హైలైట్స్ గా చూపించబోతున్నారనేది స్పష్టం.
అంటే ‘బాహుబలి’లో మిస్ అయిన రాజమౌళి మార్క్ ఏమోషన్ సన్నివేశాలు ‘బాహుబలి 2’లో పుష్కలంగా ఉండనున్నాయి. అయితే టాలీవుడ్ లో జరుగుతున్న మరో ప్రచారం ఏమిటంటే… ‘బాహుబలి 2’ ఆడియో వేడుక పై గానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గానీ రాజమౌళి ఈ ప్రశ్నకు పరోక్షంగా సమాధానం ఇచ్చేయవచ్చు అని! ‘మర్యాద రామన్న’ వంటి సినిమాలకు ముందుగానే స్టోరీ మొత్తం చెప్పేసి కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చరిత్ర జక్కన్నది. కాబట్టి ముందుగా చెప్పేసినా “బాహుబలి 2”కు పెద్దగా ఇబ్బంది కలుగకపోవచ్చు.
The Congress leadership took the tough call of firing Konda Surekha from her Cabinet position…
Vyjayanthi Movies, the producers of Kalki 2898 AD, have issued an official warning about fake…