ట్రంప్‌ మాటలు వేరు… చేతలు వేరయా

ప్రపంచ శాంతికి కృషి చేస్తున్నందుకు తాను ‘నోబుల్ ప్రైజ్’కి అర్హుడినని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ అని చెప్పుకుంటారు. కానీ ఆయన మాటలకు చేతలకు ఎక్కడా పోలిక కనపడదు.

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం వారం, పది రోజులలో నిలిపివేయించగలనని ట్రంప్‌ గొప్పగా చెప్పుకున్నారు. కానీ నేటికీ యుద్ధం కొనసాగుటుంటే దానిని ఆపే బదులు నాటో ద్వారా ఉక్రెయిన్‌కి ఆయుధాలు అందించాలని నిర్ణయించారు.

ADVERTISEMENT

ఓ పక్క ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందిస్తూనే పది రోజుల్లోగా ఉక్రెయిన్‌పై కాల్పుల విరమణ చేయాలని రష్యాకు డెడ్‌లైన్‌ విధించడం ట్రంప్‌ ద్వంద వైఖరికి అద్దం పడుతోంది.

రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ స్పందిస్తూ “మా వద్ద (యావత్ ప్రపంచాన్ని నాశనం చేయగల) ‘డెడ్‌ హ్యాండ్’ అణ్వాయుధ వ్యవస్థ ఉందంటూ” ఘాటుగా జవాబు ఇవ్వడంతో ట్రంప్‌ అహాన్ని దెబ్బ తీసినట్లుంది. బహుశః అందుకే  రెండు అణు జలాంతర్గాములను రష్యా వద్దకు పంపిస్తున్నారు.

భారత్‌, ఉక్రెయిన్‌, పాకిస్తాన్, కెనడా తదితర దేశాధినేతలని ఉద్దేశ్యించి చాలా చులకనగా మాట్లాడటం ట్రంప్‌కి తప్పుగా అనిపించలేదు. కానీ రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ అన్న మాటలకు ట్రంప్‌ ‘హర్ట్’ అయిపోయి రష్యాతో అణు యుద్ధానికి సిద్దమైపోయారు!

భారత్‌-పాక్, రష్యా-ఉక్రెయిన్‌, ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలు యుద్ధాలు చేయవద్దని హుకుం జారీ చేసిన ట్రంప్‌ ఏమి చేశారు? ఏమి చేస్తున్నారు?అని ఆలోచిస్తే మోడీ నా మిత్రుడు అంటూనే భారత్‌పై 25 శాతం సుంకాలు,అదనంగా జరిమానా కూడా విధించిన ట్రంప్‌, పాకిస్తాన్‌పై తొలుత ప్రకటించిన 23 శాతం సుంకాన్ని 19 శాతానికి తగ్గించి పాక్ పట్ల తన ప్రేమని తద్వారా భారత్‌ పట్ల తన ద్వంద వైఖరిని మరోసారి చాటుకున్నారు.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం విరమించాలని హుకుం జారీ చేసిన ట్రంప్‌ ఇరాన్ మీదకు తన స్తెల్ట్ యుద్ధ విమానాలు పంపించి అణు కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించారు. ఇప్పుడు రష్యాతో అణు యుద్ధానికి సిద్దమైపోయారు.

ట్రంప్‌ ప్రకటించిన సుంకాలతోనే ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలు, షేర్ మార్కెట్లు అతలాకుతలం అవుతుంటే, ఇప్పుడు రష్యా వద్దకు రెండు అణు జలాంతర్గాములను పంపించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Nikita Flaunts Curves In Sexy Beach Outfits

Nikita Sharma is turning up the tropical heat with her latest breathtaking beach photoshoot, proving…

12 minutes ago

Will Tamil Fans Skip Ramayana for Nayanthara’s Comeback?

After the back to back failures of Toxic and Hi, Nayanthara's next release will most…

32 minutes ago