
ఇందులో హీరో పాత్ర అక్షయ్ కుమార్ ధరించిన కాస్ట్యూమ్స్ దర్శకుడి అపరిపక్వతను తెలియజేసేలా ఈ పోస్ట్ ఉంది. 1959 నాటి కథతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రధాన పాత్ర సీడీఆర్ రుస్తుం పావ్రీ (నానావతి) ధరించిన నేవీ యూనిఫామ్ పై అడ్డగోలు పతకాలు పెట్టేశారు. ఈ మెడల్స్ లో ఇటీవల కాలానికి చెందినవి కూడా ఉండడంతో రక్షణ రంగ అధికారులు పెదవి విరుస్తున్నారు. 1972 తర్వాత ప్రవేశపెట్టిన పలు మెడల్స్ తోపాటు 1999 కార్గిల్ యుద్ధం, 2001-02లో ప్రవేశపెట్టిన ఓపీ పరాక్రమ్ మెడల్ కూడా ఈ యూనిఫామ్ లో కలిపేయడం విశేషం.
ఇక, నేవీ యూనిఫామ్ లో భుజాల మీద ఉండే నెల్సన్ రింగ్ ను రివర్స్ లో అతికించారు. అప్పట్లో నేవీ అధికారులు గడ్డం లేకుండా మీసం కలిగి ఉండేందుకు అనుమతి లేదు. క్లీన్ షేవ్ ఉండాల్సిందే. ఇక గడ్డం లేకుండా కేవలం మీసాన్ని కలిగి ఉండడాన్ని 1971 తరువాతే నేవీలో అనుమతించారు. ఈ తప్పులన్నీ ఎత్తి చూపడంతో సందీప్ ఉన్నిథాన్ పెట్టిన ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
మహారాష్ట్ర ఆడపులిగా పేరు గాంచిన మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి దారాశివ్ జిల్లాలోని…
Salman Khan has lost his cool at the paparazzi once again. This time, the incident…