
“మగధీర” సినిమా ఎంత హిట్ అయ్యిందన్న విషయం అందరికీ తెలిసిందేనని, అయితే అప్పటివరకు ఇండస్ట్రీలో రికార్డుల పేరు మీద ‘ఫేక్ ట్రెండ్’ ఒకటి కొనసాగుతోందని, ఇందుకు ఏ హీరో కూడా అతీతులు కాదని, కానీ ‘మగధీర’ సినిమా విషయంలో నిర్మాత అల్లు అరవింద్ తో జరిపిన చర్చల తర్వాత, ఇలాంటి ‘ఫేక్ రికార్డులకు’ చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నామని రాజమౌళి స్పష్టం చేసారు.
అంతకుముందు “సింహాద్రి” సినిమా ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్టయ్యి, వంద రోజులు రికార్డు సెంటర్లలో ఆడిందని, ఆ తర్వాత 175 రోజుల రికార్డుల కోసం కొన్ని ధియేటర్లలో ఆడించారని, ఆ పద్ధతి తనకు నచ్చలేదని, ఆ తర్వాత ఇతర హీరోల సినిమాలు కూడా అలాగే కొనసాగాయని, అందుకే వీటికి శుభంకార్డు వేయాలని భావించగా, నిర్మాత అల్లు అరవింద్ గారు కూడా ‘మగధీర’ 100 రోజుల విషయంలో అదే పని చేసారని తెలిపారు.
ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం… ఇలా ఫేక్ రికార్డులను ప్రోత్సహించకూడదని భావించామని, అయితే అభిమానుల ఒత్తిడి మేరకు అల్లు అరవింద్ ఆ పని చేసారని, కానీ ఆ తప్పుడు రికార్డులను సమర్ధించడం ఇష్టం లేకనే తాను 100 రోజుల వేడుకకు వెళ్లలేదని, ఒకవేళ వెళితే ఆ రికార్డులను తాను కూడా అంగీకరించిన వాడిని అవుతానని… అల్లు అరవింద్ తో గల విభేదాలకు అసలు కారణాలు వివరించారు జక్కన్న.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…