
అవును… కాన్సెప్ట్ ఏదైనా, దానికి తగిన విధంగా సంగీతాన్ని అందించడంలో థమన్ నేర్పరితనం అద్భుతంగా ఉంటోంది. చిన్న సినిమాలకు, పెద్ద సినిమాలకు ఒకే సమయంలో సంగీతాన్ని అందించడం సాధారణ విషయం కాదు. ఇందులో థమన్ గురువు గారైన మణిశర్మ వంటి అద్భుతమైన బ్యాక్ సంగీతాన్ని అందించే నిపుణులు సైతం విఫలం అయ్యారు. కానీ థమన్ మాత్రం అలవోకగా అన్ని సినిమాలకు, అన్ని జోనర్స్ కు అదిరిపోయే సంగీతాన్ని అందిస్తూ…. టాలీవుడ్ కు భవిష్యత్తు ఆశాకిరణంలా కనపడుతున్నారు. తాజాగా విడుదలైన “గాయత్రి” టీజర్ లో కూడా మోహన్ బాబు డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదే స్థాయిలో ఉంది.
ఇదొక్కటే కాదు, ఇటీవల విడుదలైన “భాగమతి” ట్రైలర్ లో కూడా థమన్ బ్యాక్ గ్రౌండ్ సంగీతమే హైలైట్ అయ్యింది. చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి… గత ఏడాది కాలంగా థమన్ సంగీతం అందించిన సినిమాలు విఫలమయ్యాయేమో గానీ, ఈ సంగీత దర్శకుడి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం మెప్పులు పొందుతూనే ఉంటోంది. టాలీవుడ్ లో బ్యాక్ గ్రౌండ్ అంటే ఒకప్పుడు మణిశర్మ పెట్టింది పేరు. ప్రస్తుతం దానికి ‘బ్రాండ్ అంబాసిడర్’లా థమన్ మారుతున్నారు. భవిష్యత్తులో మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ లకు సంబంధించిన ఓ రెండు, మూడు సినిమాలు పడితే… మనోడి పేరు మామూలుగా మోతమ్రోగదేమో!
Ravi Teja is coming off the success of Irumudi, and it looks like the actor…
The makers of Chakkora – Lunar Love Bird have unveiled their first single “Addamla Cheyana,”…