
“అలా అన్నవాళ్లెవ్వరూ (లార్గో వించ్ కాపీ) కనీసం ఆ ఫ్రెంచ్ సినిమా కూడా చూసి ఉండరు. నిజం చెప్పాలంటే నేనూ ఆ సినిమా చూడలేదు. నా ‘రన్ రాజా రన్’ సినిమానే కాస్త మార్చి ‘సాహో’గా తీశా. నాన్న చనిపోతే, ఎక్కడో బతుకుతున్న హీరో వచ్చి.. తాను ఆ నాన్నకు కొడుకునని నిరూపించుకోవడం ‘లార్గోవించ్’ కథ. ‘సాహో’ కథకీ దానికీ సంబంధం ఉందా? నాన్న చనిపోయిన కథలన్నీ ‘లార్గోవించ్’లేనా? కొంతమంది ఈ కథకి అర్థం లేదన్నారు. అర్థం కాకపోవడానికీ, అర్థం లేకపోవడానికీ చాలా తేడా ఉంది. అర్థం కాలేదంటే మళ్లీ చూడాలి. అలాంటప్పుడు అర్థం లేదని రాయడం తప్పు. మీ అభిప్రాయాన్ని ప్రేక్షకులపై రుద్దేయడం ఇంకా తప్పు,” అని చెప్పుకొచ్చాడు సుజీత్.
సుజీత్ లార్గో వించ్ సినిమా చూడలేదన్నప్పుడు సాహూ కథ ఆ సినిమా కథ ఒకటి కాదని అంత ఖరాకండిగా ఎలా చెప్పగలడు? పైగా “బిహార్ నుంచి చాలామంది ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. ‘బిహార్‌లో పుట్టి ఉంటే గుడి కట్టేసేవారు’ అని ఒకాయన చెప్పాడు. తెలుగులో ఓ కుర్రాడొచ్చి, పాన్ ఇండియా సినిమా తీస్తే.. మన వాళ్లు గుర్తించడం లేదు. అదే నా బాధంతా. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాని నెత్తిమీద పెట్టుకున్నారు. ‘సాహో’కి వస్తున్న వసూళ్లే అందుకు సాక్ష్యం,” అంటూ చెప్పుకొచ్చాడు.
సాహూకు ఇప్పుడు కనీసం 70-80 కోట్లు పోయే పరిస్థితి. దానికి ఎవరు కారణం. ఈ మాత్రం ఆడింది అంటే అది ప్రభాస్ పాపులారిటీ వల్ల. సినిమా చూసి సుజీత్ బాగా తీశాడు అని అన్నది ఎవరు? ఒక దర్శకుడు ప్లాప్ తీయడం తప్పేమీ కాదు. మనది 10% సక్సెస్ కూడా లేని ఇండస్ట్రీ. కాకపోతే ప్రేక్షకులు ప్లాప్ అని నిర్ణయించేశాకా కూడా బీహార్ లో అలా అంటున్నారు ఢిల్లీలో ఇలా అంటున్నారు అంటూ తనను తాను మోసం చేసుకుంటే అసలకే మోసం వస్తుంది. సుజీత్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాకు ఎంత కష్టపడాల్సి వస్తుందో చూస్తే తను ఈ సినిమాలో ఏం చేశాడో అర్ధం అవుతుంది. సుజిత్ అన్నా… ఇంక ఎక్కువ లాగకు తెగుద్ది
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…
Telangana politics are starting to heat up again as a social issue has come up…