Telugu

సచిన్ డ్రామా ఎంతవరకు పండింది!

ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ జీవితగాధతో తెరకెక్కిన “సచిన్ – ఎ బిలియన్ డ్రీమ్స్” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మూడు రోజులు పూర్తయ్యింది. క్రికెట్ పరంగా తిరుగులేని సచిన్ ను వెండితెరపై ఎలా రిసీవ్ చేసుకున్నారు అనే దానికి నిదర్శనంగా తొలి మూడు రోజుల కలెక్షన్స్ ఉన్నాయని చెప్పవచ్చు. శుక్రవారం నాడు 8.40 కోట్ల ఓపెనింగ్స్ తో ప్రారంభమైన ఈ సినిమా శనివారం నాడు 9.20 కోట్లు అందుకోగా, ఆదివారం నాడు 10.25 కోట్లను తన ఖాతాలో వేసుకుంది.

దీంతో తొలి మూడు రోజులకు గాను మొత్తం 27.85 కోట్లు కొల్లగొట్టింది. ఒక డాక్యుమెంటరీ డ్రామా తరహాలో తెరకెక్కిన సినిమాకు ఈ రేంజ్ లో వసూళ్లు రావడమంటే చెప్పుకోదగ్గ విషయమే. అయితే సచిన్ బ్రాండ్ తో తొలి మూడు రోజులు మంచి వసూళ్ళనే సాధించినప్పటికీ, అసలు పరీక్ష సోమవారం నాడు ఎదురుకానుంది. ఒక్క ‘బాహుబలి 2’ను మినహాయిస్తే, వీక్ డేస్ లో సినిమాల కలెక్షన్స్ చాలా వీక్ గా ఉంటున్నాయి. మరి సచిన్ కూడా ఇందుకు మినహాయింపు అవుతాడో లేడో చూడాలి.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Romanchakam Review: U.S. Premiere Report

Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…

2 hours ago

Ravi Teja Gave More Confidence To Jr NTR?

Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…

6 hours ago