
అందులో మన తెలుగు వారు కూడా ఉంటారు. అలాంటి వారి కోసమే “సచిన్ – ఎ బిలియన్ డ్రీమ్స్” సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. గతంలో ‘ఎం.ఎస్.ధోని – ది అన్ టోల్డ్ స్టోరీ’ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించి, బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా, తాజాగా ‘సచిన్’ సినిమా కూడా తెలుగులోకి డబ్ అవుతుండడం, సచిన్ అభిమానులను పులకింపచేస్తోంది. ఇటీవల హిందీలో విడుదలైన ధియేటిరికల్ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన రాగా, తాజాగా తెలుగులో కూడా ఈ ట్రైలర్ ను విడుదల చేసారు.
సచిన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా, ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచేలా ఉంటుందన్న నమ్మకాన్ని ట్రైలర్ కలిగించింది. అయితే ధోని మాదిరి సచిన్ జీవితంలో ‘లవ్ అండ్ రొమాంటిక్’ క్షణాలు తక్కువ కావడంతో, సినిమా పరంగా అన్ని వర్గాలకు చేరువ అవుతుందో లేదో చూడాలి. అయితే ఈ సినిమాలో మ్యాచ్ ఫిక్సింగ్ వంటి కీలక అంశం కూడా జోడించడం, సినిమాను మరింత ఆసక్తిగా మార్చేసింది. మే 26న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ‘సచిన్ – ఎ బిలియన్ డ్రీమ్స్’ సినిమా ప్రేక్షకులను, అభిమానులను పలకరించబోతోంది.
After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…
Happy Journey features an unusual ensemble led by seven female characters- Annapurnamma, Amani, Anchor Jhansi,…