
సందీప్ కిషన్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ తెరకేక్కిస్తోన్న “నక్షత్రం” సినిమాలో ఓ 20 నిముషాల పాటు ఉండే అతిథి పాత్రను పోషించబోతున్నానని స్పష్టం చేసాడు. హీరోల నుండి అవార్డులు అందుకునే అభినయాలు రాబట్టడంలో కృష్ణవంశీ ఆరితేరిన వారన్న సంగతి తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో కూడా హావభావాలు పలికించని పక్షంలో, ఇక ఆ హీరోకు మనుగడ ఉండదన్న టాక్ కూడా ఉంది.
దీంతో ఓ పక్కన కమర్షియల్ హీరోగా ఎదుగుతున్న స్థాయిలో… మరో పక్కన కృష్ణవంశీ లాంటి దర్శకులతో పని చేయడం, సాయిధరమ్ తేజ్ ప్లానింగ్ బాగుందంటూ సినీ విశ్లేషకులు కితాభిస్తున్నారు. ఆగష్టు 16 నుండి “నక్షత్రం” సెట్స్ లోకి ఎంటర్ కాబోతున్నాడు ఈ మెగా ‘తిక్క’ హీరో!
23 ఏళ్లుగా వివాదంలో ఉన్న మియాపూర్ భూముల పై నేడు సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి భారీ…
Devi Sri Prasad is taking a different approach to the music of his acting debut,…