
వివి వినాయక్ దర్శకత్వంలో సాయి నటించబోతున్న సినిమాను ఆగష్టు 9వ తేదీన ప్రారంభించబోతున్నారు. ఇప్పటివరకు టాప్ దర్శకుల చేతిలో పడని సాయి, తొలిసారిగా ఓ స్టార్ డైరెక్టర్ తో కలిసి పని చేస్తుండడంతో, ఈ సినిమా సాయి కెరీర్ కు అత్యంత కీలకంగా మారబోతోందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి సినిమా ముహూర్తం మహేష్ పుట్టినరోజు కావడం కాకతాళీయమే.
అంటే ఈ సారి ప్రిన్స్ పుట్టినరోజు నాడు మెగా ఫ్యాన్స్ కూడా హంగామా చేయబోతున్నారన్న మాట. ఈ సినిమా టైటిల్ “దుర్గ” అని హల్చల్ చేసినప్పటికీ, అందులో వాస్తవం లేదని ఇటీవల వినాయక్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కు “ఆది” వంటి కెరీర్ టర్నింగ్ సినిమాను ఇచ్చిన వినాయక్, సాయి ధరమ్ తేజ్ కెరీర్ ను ఎలా టర్న్ చేస్తారోనని అభిమానులతో పాటు మెగా కాంపౌండ్ కూడా ఆసక్తిగా ఉంది
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…