Telugu

పిక్ టాక్ – ‘విన్నర్’ కోసం ‘పరుగు’

టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ ఎవరు అంటే… రకుల్ ప్రీత్ సింగ్ అన్న సమాధానం వెలువడుతుంది. ఓ పక్కన చెర్రీతో ‘ధృవ’ చేసిన రకుల్, మరో వైపు ప్రిన్స్ మహేష్ బాబు సరసన కూడా నటిస్తోంది. అలాగే మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ సరసన “విన్నర్” సినిమాలో నటిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్ లుక్స్ తాజాగా బయటకు వచ్చాయి.

గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించి ఓ రెండు స్టిల్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ పరిగెడుతుండగా, ఈ ముద్దుగుమ్మ వెంట పడుతున్న హీరో సాయి స్టిల్ వీక్షకులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఈ ఫోటోలో రకుల్ స్టిల్ అదిరిపోయేలా ఉండడంతో అభిమానులకు కన్నుల విందుగా మారింది.

ADVERTISEMENT

ఈ సినిమా టైటిల్ కు తగ్గట్లు… ఈ హీరోహీరోయిన్ల పరుగుల పోటీలో ఎవరు “విన్నర్” అంటే… ఖచ్చితంగా రకుల్ ప్రీత్ సింగ్ అన్న టాక్ వెలువడుతోంది. అటు లుక్ పరంగానూ… ఇటు పరుగు పరంగా… ఏదైనా గానీ తన అందచందాలతో రకుల్ అందరినీ పడేస్తోందని చెప్పాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

OTT Deal: The Key to Vishwambhara’s Release

Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…

5 minutes ago

కొండా అడుగులు ఎటువైపు.?

కొండా సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడం తో ఇక ఎంతో కాలం కొండా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో…

26 minutes ago