Telugu

‘పాములు’ పట్టుకుంటున్న ఒకప్పటి ‘హీరో’

‘నువ్వే కావాలి’ సినిమాలో ‘అనగనగా ఆకాశం ఉంది…’ అంటూ ఒక్క పాటతో ఊపేసిన నటుడు సాయి కిరణ్, ఆ తర్వాత కొన్ని చిత్రాలలో నటించి కనుమరుగయ్యాడు. ప్రస్తుతం సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న సాయి కిరణ్ ను ఇటీవల ఓ మీడియా పలకరించడంతో తన విలక్షణమైన అలవాటు గురించి చెప్పుకొచ్చారు. సాధారణంగా డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను అనే డైలాగ్స్ వింటుంటాం, కానీ, సాయి కిరణ్ విషయంలో మాత్రం అలా కాదు, పాములు పట్టుకోవడమే తన హాబీ అంటూ బయటపెట్టారు.

ADVERTISEMENT

తన చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనల రీత్యా… పాములను పట్టుకోవడం హాబీగా మారిందని, ఇందుకోసం ఓ సంస్థలో శిక్షణ కూడా తీసుకున్నానని, ఆ తర్వాత 3 వేల పాములను పైగా పట్టుకోగా, కొన్ని వందల సార్లు తనను కరిచాయని, కానీ ఒక్కసారి మాత్రం విషసర్పం కాటేసిందని తెలిపారు. టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్, నాగబాబు ఇళ్ళల్లో కూడా పాములను పట్టుకున్నానని, అలాగే తన కార్పెంటర్ కృష్ణ ఇంటిలో పట్టుకున్న త్రాచు పాము ఎపిసోడ్ థ్రిల్లింగ్ ఎపిసోడ్ ను తలపిస్తుందని వివరించారు.

ఇక్కడ మాత్రం తన పని అయిపోయిందని భావించానని, అయితే దేవుడి దయ వలన బతికి బట్టకట్టానని, గుడిసెలో ఉన్న త్రాచుపాముని పట్టుకోవడానికి లోపలికి వెళ్ళగా, పామును పట్టుకునే సమయానికి కరెంట్ పోవడంతో చీకటి అలుముకుందని, ఇక తన పని అయిపొయింది అనుకున్నానని, ఆ ఇంట్లో కనీసం మరో లైట్ కూడా లేదని, అయితే చివరకు దగ్గరగా ఉన్న ఆటో లైట్ సాయంతో విజయవంతంగా పామును పట్టుకుని బయటకు వచ్చానని గుర్తు చేసుకున్నాడు. ఏది ఏమైనా సినీ నటులలో సాయి కిరణ్ నడుచుకుంటున్న తీరు ఎవరూ చేయలేనిదని ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Kamal Haasan Returns: Did He Choose the Wrong Director?

Following the terrible failures of Indian 2 and Thug Life, Kamal Haasan has still not…

24 minutes ago

Pics: Manjari Fadnnis Sizzles In Shimmering Beach Gown

Manjari Fadnnis is setting screens ablaze with a spellbinding beachside photoshoot drenched in pure golden…

43 minutes ago