Telugu

సాయికృష్ణ వివాదం..న్యాయం బాధితులకా.? కులానికా.?

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సాయికృష్ణ వివాదం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ పోరుగా మారనుందా.? వైసీపీ మార్చనుందా.? అంటే ప్రస్తుతం ఈ వివాదం పై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, తెరమీదకు తెస్తున్న కుల ప్రస్తవన తో వైసీపీ సాయికృష్ణ కేసును కుల రాజకీయాల దిశగా నడిపించాలని భావిస్తుందా.? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు సాయి కృష్ణకు పోలీసులకు మధ్య ఎం జరిగింది అనేది ఇప్పటికి బయటకు రాలేదు. ఇటు వైసీపీ నేతలు మాత్రం సాయికృష్ణ ను పోలీసులే అత్యంత దారుణంగా కొట్టి లాకప్ డెత్ చేసారని, ఆధారాలు కూడా లేకుండా చేసేందుకు ఆయన శవాన్ని కూడా కాల్చి బూడిద చేసారంటూ ఆరోపణలు చేస్తున్నారు.

ADVERTISEMENT

అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా.? ఉంటే సాయి కృష్ణ ఎక్కడ.? అంటూ వైసీపీ ఒకపక్క ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూనే మరోపక్క సాయికృష్ణ కుటుంబం జనసేన పార్టీ అభిమానులని, ఒక జనసైనికుడికి కూటమి ప్రభుత్వంలో ఇంత అన్యాయం జరిగితే అది పవన్ కు పట్టదా.?

కాపు సామాజికవర్గానికి చెందిన ఒక వ్యక్తిని పోలీసులు లాకప్ డెత్ పేరుతో చంపేస్తే రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ దాని మీద స్పందించరా.? అదే సామాజికవర్గ నేతగా పవన్ చలించారా.? ఎక్కడో తెలంగాణలో ఉన్న తన అభిమానికి అనారోగ్యం అంటే కదిలిన పవన్ ఇక్కడే తన పార్టీ గెలుపు కోసం కష్టపడిన ఒక జనసైనికుడి ప్రాణం పోతే ఉలుకుపలుకు లేకుండా ఉంటారా.? అంటూ పవన్ టార్గెట్ గా కాపు కుల రాజకీయాన్ని తెరమీదకు తెచ్చారు.

అయితే వైసీపీ వాదన ఇలా ఉంటే ఈ అంశం మీద ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు, సాయి కృష్ణ వివాదం పై వాస్తవాలు బయటకు రావాలంటూ విచారణకు ఆదేశించారు. అలాగే ఈ కేసులో ఇప్పటికే విజయవాడ కృష్ణలంక కు సంబంధించిన సిఐ నాగరాజుని డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు సిపి ప్రకటించారు.

ఇక రాష్ట్ర హైకోర్టు సైతం సదరు సాయికృష్ణ ను ఈ నెల 29 లోపు కోర్టు లో హాజరుపర్చాలంటూ పోలీస్ అధికారులను ఆదేశించింది. అయితే కోర్ట్ ఆదేశాలతో పోలీస్ అధికారులు ఈ నెల 29 లోపు సాయికృష్ణ ను న్యాయస్థానం ముందు హాజరుపరుస్తారా లేదా అనేది తేలుతుంది.

ఒకేవేళ అలా జరగకపోతే న్యాయస్థానాలు సదరు అధికారుల మీద చర్యలకు ఆదేశాలు జారీ చేస్తారు. ఒకేవేళ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా సాయికృష్ణ కు పోలీసుల నుండి ఎటువంటి ప్రాణాపాయం అయినా జరిగితే అందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ ఎలా బాధ్యుడవుతాడు.? అలాగే సాయికృష్ణ కు న్యాయం జరగడానికి, ఆయనకు అన్యాయం జరగడానికి ఆయన కులం ప్రాతిపదిక ఎలా అవుతుందా.?

కుల ఆధారంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పని చెయ్యాలని వైసీపీ ఆశిస్తుందా.? అలా జరిగితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ స్థాయికి దిగజారుతుందో వైసీపీ ఊహించగలదా.? ఒక వ్యక్తి చుట్టు జరుగుతున్న వివాదాన్ని వైసీపీ కులానికి ఎందుకు ఆపాదిస్తుంది.?

ప్రతి వివాదానికి వైసీపీ ఇలా కులం ఆపాదిస్తూ రాజకీయాలు చేస్తే ఇక రాష్ట్రంలో జరిగే అన్యాయాలకు, దారుణాలకు కారణమైన ప్రతి ఒకరు తమ కులం కార్డు ముందుపెట్టె ప్రమాదం లేదా.? వైసీపీ భావిస్తుంది బాధితులకు న్యాయం జరగాలనా.? లేదా కులానికి న్యాయం చెయ్యాలనా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Rishabh Out: SRH Star In? Test Comeback Loading

Ishan Kishan could be back in India’s Test plans ahead of the upcoming New Zealand…

19 minutes ago

Pics: Kangan Turns Silver Style Into Pure Glamour

Kangan Baruah brings a flash of metallic glamour to this striking portrait series. Her silver…

40 minutes ago