Telugu

అటు నటనలోనూ..ఇటు ప్రమోషన్లోనూ..!

సాధారణంగా సినీరంగంలో హీరోలదే ఆధిపత్యం, సినిమా మొత్తం కూడా హీరో మధ్యే కథ నడుస్తుంది…కాబట్టి సినిమాను ప్రేక్షకులకు చేరువ చేసే బాధ్యత కూడా హీరోల భుజం మీదే ఉంటుంది అనే భావంతో సినిమా ప్రమోషన్లలో పెద్దగా ఆసక్తి చూపించరు కొంతమంది హీరోహీన్స్.

ADVERTISEMENT

అయితే ఇందుకు భిన్నంగా ఉంటారు నటి సాయిపల్లవి. తన సహజ నటనతో, నాట్యంతో తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న సాయిపల్లవి నటనలో ఎంత డేటికేషన్ చూపిస్తారో అదే విధంగా తన సినిమాను ప్రమోట్ చేయడానికి కూడా అంటే ఆసక్తి కనపరుస్తారు.

మీడియా తో ఇంటర్ వ్యూ లు, చిట్ చాట్ లు ఇస్తూనే మరో పక్క చిత్ర యూనిట్ ఏర్పాటు చేసే అన్ని ప్రమోషనల్ ఈవెంట్ లకు తప్పక హాజరవుతారు సాయి పల్లవి. అయితే తాజాగా ఈ అమ్మడు హీరోహిన్ గా నటించిన ‘అమరన్’ సినిమా విడుదలకు సిద్దమైన సందర్భంగా సినిమా ప్రమోషన్ ను షురూ చేసింది ఈ హైబ్రిడ్ పిల్ల.

ఇందులో భాగంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ ని సందర్శించారు సాయిపల్లవి. అమరన్ సినిమా ప్రమోషన్ ప్రారంభించే ముందు అక్కడికి వెళ్లాలనుకున్నా, మన కోసం వారి ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఎందరో వీర జవాన్ల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ మెమోరియల్ నన్ను భావోద్వేగానికి గురి చేసింది.

శత్రు దేశం పోరాటాలలో ప్రాణాలు విడిచిన సైనికుల పేరు మీద ఇటుకలు పేర్చడం చాల స్పుర్తిదాయకం అంటూ మేజర్ ముకుంద్ వరదరాజన్, సిపాయి విక్రమ్ సైన్ లకు నివాళ్లు అర్పిస్తూ అక్కడ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ అమ్మడు.

ఈ నెల 31 న రిలీజ్ కు రెడీ అయిన అమరన్ మేజర్ ‘ముకుంద్ వరదరాజన్’ అనే ఒక వీర జవాన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో ముకుందం గా శివ కార్తికేయ నటిస్తుండగా ఆమె భార్య ఇందు పాత్రలో సాయిపల్లవి నటించారు. తెలుగుతో పాటుగా అన్ని భాషలలోను అమరన్ విడుదలవుతున్న నేపథ్యంలో అన్ని భాషలలోను ప్రమోషన్స్ చేస్తుంది చిత్ర యూనిట్.

దీనికి హీరోహిన్ సాయిపల్లవి కూడా హాజరవుతూ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేసే బాధ్యతను తన భుజాన కూడా మోస్తున్నారు. ఈ ఒక్క సినిమా విషయంలోనే కాదు సాయిపల్లవి తానూ నటించిన అన్ని సినిమా ప్రమోషన్లలోనూ ఇంతే ఆసక్తిగా పాల్గొంటూ ఇటు నటనలోనూ అటు ప్రమోషన్లలో అదే ఉచ్చుకథ చూపిస్తూ ఇతర నటీమణులకు ఆదర్శముగా నిలుస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jailer 2: Poor Planning Kills Rajini’s 1000 Cr Dream?

Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set for a…

3 hours ago

After Vijay, Will Nayanthara Enter Tamil Nadu Politics?

Vijay’s rise to power in Tamil Nadu has once again brought the spotlight on actors…

3 hours ago