Telugu

నువ్వు కూడా మాకు నచ్చావ్ “వెంకటేశ్వరులు..!

ఫ్యామిలీ ఎమోషన్స్ పాత్రలో నటిస్తూ సినిమాకు వెళ్లే ప్రేక్షకులకు ముఖ్యంగా మహిళలకు “హ్యాండ్ కీ” అవసరాన్ని గుర్తుచేసిన హీరోలలో విక్టరీ వెంకటేష్ స్థానం ఎప్పటికి పదిలంగానే

ఉంటుందని చెప్పాలి. వెంకీ మామ సినీ కెరియర్ లో మేలురాయిగా నిలబోయే 75 వ చిత్రం ‘సైంధవ్’ ట్రైలర్ లాంచ్ లో పాల్గొన్న వెంకీ మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.

ADVERTISEMENT

సినిమా ట్రైలర్ ను చూస్తే ఈసారి వెంకటేష్ అటు ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా టార్గెట్ చేసినట్టుంది. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా తన లుక్ ను మార్చుకుంటూ ట్రెండ్ ఫాలో అవుతారు విక్టరీ వెంకటేష్. నారప్పతో నయా మాస్ లుక్ లో అలరించిన వెంకీ ఇప్పుడు సైంధవ్ తో మరో మాస్ లుక్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సినిమాలో మాస్ యాక్షన్ చేసిన వెంకీ మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రం క్లాస్ సమాధానాలు ఇచ్చారు. ఇపుడు పాత సినిమాల రీరిలీజ్ ట్రెండ్ మొదలయ్యింది కదా ఆలా వస్తే మీ సినిమాలలో ఏ సినిమాను రీరిలీజ్ చెయ్యడానికి మీరు ఆసక్తి చూపిస్తారు అంటూ ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు వెంకటేష్ టక్కున “నువ్వు నాకు నచ్చావ్” అంటూ ఊహించని సమాధానము ఇవ్వడంతో అందరు సరదగా కాసేపు నవ్వుకున్నారు.

నిజంగా వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా వెంకటేష్ సినీ కెరియర్ లోనే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చిన చిత్రంగా మిగిలిపోయింది. అలాగే సంక్రాతి సందర్భంగా మీ చిన్నోడు ముందే వచ్చి థియేటర్లన్నీ సొంతం చేసుకున్నాడు మీ సినిమాకు థియేటర్లు కొరత ఏర్పడిందా అని అడగగా నాకు ఎటువంటి ఇష్యు లేదమ్మా ఎన్ని ఉంటే అన్నే అంటూ బదులిచ్చారు. సినిమాలో సెంటిమెంట్ ఏ మోతాదులో ఉంది అనే ప్రశ్నకు ఈ సారి సినిమాకు వచ్చేటపుడు అందరు మర్చిపోకుండా కర్చీఫ్ లు తెచ్చుకోండి అంటూ బదులిచ్చారు.

అలాగే తన కొడుకు అర్జున్ సినీ ఎంట్రీ గురించి కూడా ప్రశ్న మొదలవగానే ముందు చదువు ఆ తరువాత సంగతి తరువాత చూద్దాం అంటూ మాట దాటేసారు. హిమాలయాలకు వెళ్ళిపోతారా…అంటే పూర్తిగా వేళ్ళను ఆలా వెళ్లి ఇలా వస్తాను, వీళ్లందరినీ వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అంటూ సరదా సమాధానం ఇచ్చారు.ఈ సినిమా తరువాత నన్ను ‘సైంధవ్’ అంటారో, ‘సైకో’ అంటారో మీ ఇష్టం అంటూ సినిమాలో తన క్యారెక్టర్ తీరుని వివరించారు.

వైలెన్స్ కాస్త ఎక్కువైంది కదా పిల్లలుతో మూవీ చూడొచ్చా అని మరో విలేకటి అడగగా…
ఖచ్చితంగా చూడొచ్చు, పిల్లలు ఆడుకునే వీడియో గేమ్స్ లో ఉండేంత వైలెన్స్ ఈ సినిమాలో లేదు అంటూ నేటి తరం వారి అభిరుచులను ఒక్క ముక్కలో చెప్పారు. ఇలా మీడియా అడిగిన ప్రశ్నలకు వెంకీ మస్త్ జోషైన సమాధానాలు ఇచ్చి నవ్వులు పూయించారు.

శైలేశ్ కొలను దర్శకత్వంలో జనవరి 13 సంక్రాంతి కి సై అనడానికి ‘సైంధవ్’ తో థియేటర్లకు వస్తున్నాడు వెంకీ మామ. మరి ఈ సారి కూడా “నువ్వు నాకు నచ్చాలి వెంకటేశ్వరులు”…అంటూ వెంకీ ఫాన్స్ సినిమా చూడడానికి రెడీగా ఉన్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Hombale Films’ Cinematic Marvel – Mahavatar Parasuram

India's biggest production house Hombale Films has made a grand announcement on the highly auspicious…

2 hours ago

అందరికీ 24 గంటలే కానీ…

‘నాకు టైమ్ లేదు.. లేకుంటేనా..’ అనేవాళ్ళే ఈ లోకంలో ఎక్కువ. కానీ ఉన్న ఆ కొద్ది పాటి టైమ్‌లో కొందరు…

2 hours ago