
శివుడి వరం పొందిన భస్మాసురుడు ఆయనపైనే చెయ్యి పెట్టాలనుకొని భస్మం అయిపోయిన్నట్లే, వైసీపీ అధినేత జగన్ మెప్పు కోసం పోటీలుపడి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను అవహేళన చేసినవారు కూడా తమ నెత్తిన తామే చేతులు పెట్టుకొని భస్మం అయిపోతున్నట్లు కేసులలో చిక్కుకొని జైలు పాలవుతున్నారు.
రాజకీయాలలో ఉన్న దేశముదురు వైసీపీ నేతలు ఈ ఆటుపోట్లను తట్టుకోగలరు. ఎలాగైనా బయటపడగలరు. కానీ సినీ పరిశ్రమకు చెందిన రాంగోపాల్ వర్మ, పోసాని కృష్ణ మురళివంటి వారు కూడా జగన్ అండ దండలు చూసుకొని పేట్రేగిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
అయితే వారిలో రాంగోపాల్ వర్మ తెలివిగా వ్యవహరించి ముందస్తు బెయిల్ సంపాదించుకున్నారు కానీ పోసాని కృష్ణ మురళి అడ్డంగా దొరికిపోయారు.
అంతేకాదు.. ఈ కేసులలో సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆయన కుమారుడు వైసీపీ సోషల్ మీడియాని నడిపించిన సజ్జల భార్గవ రెడ్డిని కూడా ఇరికించేశారు. దీంతో వారిరువురూ ముందే మేల్కొని హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ సంపాదించుకున్నారు.
కనుక ఇద్దరూ ప్రస్తుతానికి సేఫ్.. కానీ ఎంతకాలం?అంటే వారికీ తెలియదు. ఎందుకంటే చేసిన పాపాలు అటువంటివి. కాస్త ఆలస్యమైన వాటి ఖర్మ ఫలం అనుభవించక తప్పదని వారికీ తెలుసు.
టీడీపీతో రాజకీయ ప్రవేశం చేసి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీలో చేరిన తర్వాత అన్నం పెట్టిన అమ్మ వంటి టీడీపీ కార్యాలయంపైనే దాడి చేయించారు. అందుకు మూల్యం చెల్లిస్తున్నారిప్పుడు.
కానీ ఎన్ని పాపాలు చేసినా నాలుగు రోజులు జైల్లో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చేయవచ్చని ధీమాగా ఉన్న వంశీకి విజయవాడ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. కనుక హైకోర్టుకి అక్కడా లభించకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిందే. అంతవరకు వంశీ జైల్లో గడపాల్సిందే.
వైసీపీ నేతలు ఎదుర్కొంటున్న ఈ కేసులు, కష్టాలకు వారు సిఎం చంద్రబాబు నాయుడుని, మంత్రి నారా లోకేష్‌ని నిందిస్తున్నప్పటికీ, తమకు ఈ దుర్గతి ఎందుకు పట్టిందో వారికే బాగా తెలుసు.
ప్రభుత్వ, విధానాలను, ముఖ్యమంత్రి నిర్ణయాలను విమర్శించడం తప్పు కాదు. కానీ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నప్పుడు ఎటువంటి ఆధారాలు చూపకుండా దోచుకుంటున్నారని ఆరోపించడమే తప్పు.
The next 24 hours could be extremely consequential in Indian politics as something big is…
The elections to the Telugu Film and TV Dancers and Dance Directors Association will not…