టిడిపి చెపుతున్నదే సజ్జల కూడా చెపుతున్నారుగా?

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో ఎటువంటి బాలమైన సాక్ష్యాధారాలు లేకుండా అధికారులు తమ అవగాహన కోసం వ్రాసుకొనే షాడో ఫైల్స్ ఆధారంగా ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారని టిడిపి వాదిస్తోంది. మాజీ ఆర్ధికశాఖ కార్యదర్శి పీవీ రమేష్ కూడా ఇదే చెప్పారు. చంద్రబాబు నాయుడు తరపున ఈ కేసును వాదిస్తున్న లూద్ర కూడా ఒరిజినల్ ఫైల్ ఏదని ప్రశ్నిస్తున్నారు. ఒరిజినల్ ఫైల్ లేకుండా చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని ఏవిదంగా నిర్ధారించారో చెప్పాలని నిలదీస్తున్నారు. దీనికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన సమాధానం వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

ADVERTISEMENT

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “అవినీతికి పాల్పడిన చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం, జైలుకి పంపించడం చాలా నేరమన్నట్లు టిడిపి నేతలు అడ్డుగోలుగా వాదిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన అవినీతి బయటపడకుండా ముందే జాగ్రత్తపడుతూ ఆ ఫైల్స్ అన్నీ ఎప్పుడో నాశనం చేశారు. కానీ ఆయన ఈ అవినీతి కేసు నుంచి తప్పించుకోలేరు,” అని ఇంకా చాలా చెప్పారు.

అంటే వైసీపి ప్రభుత్వం వద్ద ఈ కేసుకు సంబందించి ఒరిజినల్ ఫైల్ లేదని, ఎటువంటి సాక్ష్యాధారాలు కూడా లేవని టిడిపి వాదనలు నిజమే అని అర్దమవుతోంది. కానీ చంద్రబాబు నాయుడుకి అవినీతి మరక అంటించి ఆయన ప్రతిష్టను దెబ్బ తీసేందుకే ఈ కుంభకోణం పేరుతో ఓ లేని కేసును తయారుచేశారని అర్దమవుతోంది. ఒకవేళ ఒరిజినల్ ఫైల్‌ను చంద్రబాబు నాయుడు నాశనం చేసి ఉండి ఉంటే మరే ఆధారాలతో ఈ కధ నడిపిస్తున్నట్లు?అవి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి?రేపు కోర్టు ఇదే ప్రశ్న అడిగితే ఏమని సమాధానం చెప్పుకొంటారు?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

RR Star’s New Skill a Joke? Desperate Move or Disaster

Yashasvi Jaiswal has started working on wicketkeeping ahead of the 2026-27 Ranji Trophy season, but…

26 minutes ago

Pics: Khushi Makes Black Look Fierce And Fabulous!

Khushi Dubey knows how to make black feel anything but basic. In this striking photoshoot,…

56 minutes ago