
ఎన్నో వాయిదాల తరువాత, ఎంతో నిరీక్షణ పిదప,50 రోజుల అనంతరం స్కిల్ కేసు నుండి అనారోగ్య కారణాల దృష్ట్యా నాలుగు వారాల పాటు చంద్రబాబుకి మధ్యంతర బెయిలు కోర్ట్ మంజూరు చేసిన నేపథ్యంలో ఆపార్టీ నేతలు,రాష్ట్ర ప్రజలు బాబుకి ఘనస్వాగతం పలికిన సందర్భం అధికార పార్టీ నేతలకు,బ్లూ మీడియా వర్గాల వారికి నోట్లో పచ్చి వెలక్కాయ పండిన మాదిరి తయారయ్యింది.
చంద్రబాబుకి కోర్ట్ ఇచ్చింది మధ్యంతర బెయిలు మాత్రమే, దాని కోసం ఈ టీడీపీ నేతల హడావుడి ఎంటో, టీడీపీ నేతలు సంబరాలు చేసుకోవడానికి బాబు నిర్దోషి అంటూ కోర్ట్ తీర్పు ఇవ్వలేదు కేవలం నాలుగు వారాల పాటు బెయిలు మాత్రమే ఇచ్చింది. న్యాయస్థానాలు ఇచ్చిన గడువు పూర్తీ కాగానే బాబు తిరిగి వెళ్ళాల్సింది రాజమండ్రి సెంట్రల్ జైలుకే అనే విషయం గుర్తుంచుకుంటే మీకే మంచిది అంటూ టీడీపీ నేతలకు ఉచిత సలహాలు ఇస్తున్నారు వైసీపీ పెద్దలు సజ్జల వంటి వారు.
అలాగే బ్లూ మీడియాలో కూడా ఇదే తరహా కథనాలను ప్రజలలోకి తీసుకెళ్తున్నారు. అయితే బెయిలు గురించి మీరే చెప్పలా! మేమే వినాలా? మా ఖర్మ కాకపోతేను అంటూ టీడీపీ నేతలు అధికార పార్టీ నేతలకు గట్టిగా కౌంటర్ వేస్తున్నారు. కొన్ని వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటు 31 కేసులతో 16 నెలలు జైలు జీవితం అనుభవించి 10 సంవత్సరాల నుండి బెయిలు మీద తిరుగుతున్నా మీరా మా అధినేత గురించి మా పార్టీ గురించి విమర్శించేది అంటూ జగన్ గత చరిత్రను వైసీపీ నేతలకు,రాష్ట్ర ప్రజానీకానికి మరోసారి గుర్తుచేస్తున్నారు.
ఇన్ని సంవత్సరాల పాటు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, ప్రజలను మభ్యపెడుతూ,నమ్మిన వారిని నట్టేటముంచుతూ, సొంత కుటుంబసభ్యులను హత్య చేసిన వారిని కాపాడుకుంటూ, తమ ప్రత్యర్దుల పై అక్రమ కేసులు పెట్టుకుంటూ బెయిలు అనే ఆయుధాన్ని అడ్డుపెట్టుకుని జగన్ ఆడుతున్న రాజకీయ చదరంగానికి చరమ గీతం పడాల్సిన సమయం ఆసన్నమయ్యిందన్నారు.
జగన్ జైలు నుండి వచ్చింది,రాష్ట్రాన్ని పాలిస్తుంది కూడా ఆ బెయిలు మీదే.ఒక్కసారి జగన్ కు కూడా కోర్ట్ ఇచ్చిన బెయిలు క్యాన్సిల్ అయ్యితే వెళ్ళాల్సింది అదే జైలుకి అనేది సదరు మీడియా సంస్థలు గ్రహిస్తే ఇటువంటి కథనాలకు ఆస్కారం ఉండకపోవచ్చు.
Ranabaali is the second collaboration between Vijay Deverakonda and director Rahul Sankrityan. Stay tuned for…
Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…