Telugu

ఎగ్జిట్ పోల్స్‌లో రిగ్గింగ్ జరిగిందటగా?

ఎగ్జిట్ పోల్స్ అన్నీ టిడిపి కూటమి గెలుపు ఖాయమని అదీ భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతోందని తేల్చి చెప్పేశాయి. టిడిపి కూటమి నేతలకు తాము తప్పకుండా భారీ మెజార్టీతోనే గెలుస్తామని తెలుసు. ఎగ్జిట్ పోల్స్ కూడా ధృవీకరించడంతో కూటమి నేతలు, కార్యకర్తలు చాలా సంతోషంతో ఉప్పొంగి పోతున్నారు.

పోలింగ్‌ సరళితోనే ఢీలాపడిన వైసీపి నేతలు ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ చూసి ఇంకా ఢీలాపడిపోయారు. వైసీపిలో ఎవరికీ నోట మాట రాకపోవడంతో వైసీపికి శల్యసారధ్యం చేస్తున్న సజ్జల రామకృష్ణా రెడ్డే ఈ బాధ్యత కూడా తీసుకున్నారు.

ADVERTISEMENT

పోలింగ్‌లో ఏవిదంగా రిగ్గింగ్ జరిగిందో అదే విదంగా ఎగ్జిట్ పోల్స్‌లో కూడా రిగ్గింగ్ జరిగిందన్నారు. బీజేపీకి ఈసారి ఉత్తరాదిన సీట్లు తగ్గుతుండటంతో దక్షిణాది రాష్ట్రాలలో పెరిగిన్నట్లు ఎగ్జిట్ పోల్స్‌లో చూపించుకుంటోందని సజ్జల కనిపెట్టి చెప్పారు.

కనుక ఎగ్జిట్ పోల్స్‌ని తాము నమ్మడం లేదన్నారు. వైసీపి మొదటి నుంచి పాజిటివ్ అజెండాతో పాజిటివ్ కోణంలోనే ప్రచారం చేసింది కనుక ఎగ్జిట్ పోల్స్ లో కూడా వైసీపికి పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోందంటూ ఆరా మస్తాన్ మరో రెండు మూడు ఏజన్సీల ఎగ్జిట్ పోల్స్ నివేదికలను ప్రస్తావించి, వాటి ప్రకారం వైసీపి భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి రాబోతోందని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో సంక్షేమ పధకాల వలన లబ్ధి పొందిన మహిళలందరూ వైసీపికే గంపగుత్తగా ఓట్లు వేశారన్నారు. రాష్ట్రంలో సైలంట్ ఓటింగ్ జరుగడంతో సర్వే సంస్థలకు ప్రజల నాడి చిక్కక తమకు తోచిన లెక్కలు చెపుతున్నాయన్నారు. పార్టీలో ఎవరికీ తమ పార్టీ గెలుపుపై ఎటువంటి అనుమానాలు లేవని జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలు వైసీపి విజయాన్ని ధృవీకరిస్తాయని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.

ఈసారి ఎన్నికలలో కేంద్ర ఎన్నికల కమీషన్‌, రాష్ట్ర ఎన్నికల సంఘం రెండూ కూడా చాలా పక్షపాతంగా వ్యవహరించాయని, అయినా జగన్‌ ఇమేజ్‌ని చూసి ప్రజలు వైసీపికే ఓట్లు వేసి గెలిపిస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. తాము ఎన్నడూ టిడిపి కూటమిని ఓడిస్తామని అనలేదని, వైసీపి 175/25 సీట్లతో గెలుస్తుందని మాత్రమే పాజిటివ్‌గా చెప్పుకున్నామన్నారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Forget Reels, Focus on Real Life: Suriya

Actor Suriya has a message for students who spend too much time making reels, focus…

35 minutes ago

అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ సీట్ల కోసం పట్టుబడితే ఎలా?

స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన 40 శాతం సీట్లకు పట్టుబడుతున్నట్లు మంత్రి కందుల దుర్గేష్, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్…

38 minutes ago