యార్లగడ్డ ఉంటే ఉండొచ్చు… లేకుంటే పోవచ్చు: సజ్జల

గన్నవరం టికెట్‌ పంచాయితీని సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్క మాటతో తేల్చేశారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “ ఎన్నికలు దగ్గర పడుతున్నందున పార్టీలో ఆశావాహులు చాలామంది టికెట్స్ అడుగుతుంటారు. కానీ అందరికీ టికెట్స్ ఇవ్వలేము. అభ్యర్దుల ప్రజాధారణ, ప్రత్యర్ధుల బలాబలాలు చూసి టికెట్స్ ఇస్తుంటాము. అలాగని టికెట్‌ ఇవ్వనివారిని అవమానిస్తున్నట్లు కాదు. పార్టీలో ఉంటే భవిష్యత్‌లో వారికి అవకాశాలు కల్పిస్తాము. కానీ టికెట్‌ లభించకపోతే పార్టీని వీడాలనుకొంటే ఎవరినీ ఆపలేము. పార్టీలో ఉండదలచినవారు ఉండొచ్చు… వద్దనుకొన్నవారు నిరభ్యంతరంగా బయటకు వెళ్ళిపోవచ్చు. యార్లగడ్డ వెంకటరావుకు కూడా సిఎం జగన్మోహన్ రెడ్డి ఇదే చెప్పారు. కనుక వైసీపీలో ఉండాలా లేదా బయటకు వెళ్ళిపోవాలో ఆయనే నిర్ణయించుకోవలసి ఉంటుంది,” అని అన్నారు.

ADVERTISEMENT

గన్నవరం టికెట్‌ మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకే ఇస్తామని జగన్‌ తేల్చిచెప్పేశారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గత ఏడాదే నియోజకవర్గంలో జరిగిన ఓ సభలో బహిరంగంగానే చెప్పారు. అయినా యార్లగడ్డ తానే పోటీ చేస్తానని చెప్పారు. ఇటీవల గన్నవరంలో పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి దానిలో కూడా వైసీపీ టికెట్‌ ఇచ్చినా ఇవ్వకపోయినా తాను గన్నవరం నుంచే పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.

అమెరికాలో వ్యాపారాలు చేసుకొంటూ సుఖంగా జీవిస్తున్న తనను సిఎం జగన్మోహన్ రెడ్డే రాజకీయాలలోకి తీసుకువచ్చారని, ఎన్నడూ తనకు అన్యాయం చేయనని హామీ ఇచ్చారని చెప్పారు. కానీ ఇప్పుడు జగన్‌ తనను నడిరోడ్డు మీద వదిలేసి తీరని అన్యాయం చేస్తున్నారని యార్లగడ్డ వెంకటరావు ఆవేదన వ్యక్తం చేశారు.

యార్లగడ్డకు వైసీపీ టికెట్‌ని నిరాకరించడంతో ఆయన టిడిపిలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలో ప్రవేశించినప్పుడు ఆయన సమక్షంలో టిడిపిలో చేరవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే టికెట్‌ గురించి టిడిపి అధిష్టానంతో చర్చిస్తున్నారు. టిడిపి సానుకూలంగా స్పందించిన్నట్లు సమాచారం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Why Prabhas, Mahesh, AA, Ram Charan, NTR Avoid Dasara?

Festival releases are usually a dream for film producers for better openings and a chance…

53 minutes ago

RR Star’s New Skill a Joke? Desperate Move or Disaster

Yashasvi Jaiswal has started working on wicketkeeping ahead of the 2026-27 Ranji Trophy season, but…

1 hour ago