
డాక్టర్ సునీత వివేక హత్య కేసును చాలా పెద్దది చేస్తున్నారని, ఆమె చేస్తున్న ఆరోపణలు అన్నీ జగన్కు వ్యతిరేకంగా ఉంటున్నాయని చెప్పారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు స్క్రిప్టులో సునీత నటిస్తున్నట్లుగా చెబుతున్నారు. సునీత ఇప్పుడు చంద్రబాబు పావుగా మారిపోయారని ఆయన చెప్పినట్లు చేస్తున్నారంటూ ఆరోపించారు. సజ్జల తీరు చూస్తుంటే.. తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారందరినీ చంద్రబాబు పావులే అనేలాగా ఉన్నారంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇక ఇదే విషయంపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు స్పందిస్తూ.. సజ్జల లాంటి వ్యక్తి పురాణాల్లో కూడా ఉండరేమో అంటూ వ్యాఖ్యానించారు. రాను రాను విజయమ్మను, షర్మిలను కూడా చంద్రబాబు పావు అనేలా ఉన్నాడంటూ సజ్జల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే జగన్‌ను ఎవరు వ్యతిరేకించినా వారందరినీ చంద్రబాబు మనుషులు అనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్న మాట. కేఎస్ జవహర్ ట్వీట్ చేస్తూ.. బాబాయిని అబ్బాయిలే వేసేస్తే వివేకా ఆత్మ క్షోభించదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
సీనియర్ నేత బుద్దా వెంకన్న స్పందిస్తూ.. వివేకా చనిపోయిన రోజు చంద్రబాబే హత్య చేయించారంటూ చెప్పిన రోజు లేని సిగ్గు.. ఇప్పుడు సునీత అసలు విషయాన్ని బయట పెడితే ఎందుకు అంటూ విమర్శించారు. బీటెక్ రవి కూడా నిప్పులు చెరిగారు. సజ్జల, జగన్ రెడ్డి లాంటి వారి సిగ్గు అనే మాటలు మాట్లాడితే ఆశ్చర్యంగా ఉందని చెప్పారుఅమర్‌నాథరెడ్డి మాట్లాడుతూ.. సునీత ఇప్పుడు అసలు విషయాన్ని బయట పెడితే జగన్, సజ్జల లాంటివారు తట్టుకోలేక ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారిన అంటున్నారు.
ఇక అవినాశ్ రెడ్డిని నిజాయితీ లొంగి పోవాలని, లేదంటే నిన్ను కూడా లేపేస్తారంటూ చెబుతున్నారు. మొత్తానికి సజ్జల ఏదో అనుకుని చేసిన కామెంట్లు.. ఆయన్ను, జగన్‌నే ఇరకాటంలో పడేస్తున్నాయి. మరి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని చంద్రబాబు పావులు అంటే జనం కూడా చూస్తూ ఊరుకోరు కదా. సీబీఐ విచారణలో మరిన్ని నిజాలు బయటకు వస్తే మాత్రం జగన్ అండ్ కో పరిస్థితి ఏంటో అని అంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Vishwak Sen is heading into an unusual phase of his career. Not because he has…
Avengers Endgame is proving that a film does not always need a new release to…