
సాక్షిలో ఇచ్చిన వివరణ ప్రకటనలో నిరాధార వార్తలను నమ్మెద్దని ప్రజలతో పాటు, పార్టీ అభిమానులకు పార్టీ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. ఇటువంటి అసత్య కథనాలను ప్రసారం చేయొద్దని మీడియాను కోరాయి. ఏదైనా ప్రత్యేక అంశం ఉంటే మీడియా సమావేశం లేదా పత్రికా ప్రకటన ద్వారా పార్టీ శ్రేణులతో పాటు కార్యకర్తలను తెలియచేస్తామని పార్టీ నేతలు ప్రకటించారు.
మరోవైపు ఈ నెల 6నుండి ఇడుపులపాయలో మొదలయ్యే జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగుతుందని, 13 జిల్లాల్లో దాదాపు 3 వేల కిలోమీటర్ల మేరకు ఈ యాత్ర కొనసాగనుంది. జగన్ ప్రతీరోజూ 15 నుంచి 16 కిలోమీటర్లు నడిచి, రాత్రిపూట అక్కడే బస చేస్తారని పార్టీ తెలిపింది. పాదయాత్ర సందర్భంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఆయనతో కలసి నడుస్తారు.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…