
అయితే ఈ విషయంలో సాక్షి మాత్రం ఒకరకమైన గందరగోళంలో ఉన్నట్టు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్నారా లేక వ్యతిరేకంగా ఉన్నారా అనే అనుమానంలో ఉన్నట్టు అగుపిస్తుంది. తాజాగా పెందుర్తి దళిత మహిళ దాడి కేసులో టీడీపీని పవన్ కళ్యాణ్ విమర్శిస్తే కూడా సాక్షి అందులో నిగూడ అర్ధాన్ని వెతికేపనిలో పడింది.
జనసేన పార్టీ ఎపిలో టిడిపి కూటమి నుంచి బయటకువచ్చేసినట్లేనని ఆయన ప్రకటించినట్లు లేరని, పైగా ఇంతవరకు జరిగినే అనేక కుంబకోణాలలో కాని,ఇతరత్రా దారుణమైన ఘటనలలో కాని టిడిపిని, ముఖ్యమంత్రి చంద్రబాబును తప్పు పట్టని పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా అదే రీతిగా స్పందించారా?లేక నిజంగానే చిత్తశుద్దితో వ్యాఖ్యానించారా అన్నది చూడాల్సి ఉందని సాక్షి అభిప్రాయపడింది.
అసలు జరిగిన సంఘటనకు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సాక్షి విశ్లేషణకు సంబంధం ఏంటో? గతంలో పవన్ కళ్యాణ్ నష్టం చేసిన విషయాన్నీ జీర్ణించుకోలేక ఈ విమర్శలా? లేక రేపు మళ్ళి కలిసితే ఉపయోగపడ్తాదని ముందు జాగ్రత్తా? అయితే పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ పోతే వైకాపాకు కాపు కులస్థులు దూరం అవ్వడం తప్ప ఒరిగేదేముంది?
టాక్సిక్ ఫెయిల్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో కొందరి దృష్టి రాకా మీద పడింది. విడుదలయ్యాక ఈ సినిమాకూ అదే…
Hunkkaar arrives with a subject that is bound to generate discussion, and its teaser suggests…