
ఒక రాజకీయ పార్టీకి ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ఎంతటి ప్రాణవాయువో తెలియచెప్పిన పార్టీ వైసీపీ అయితే మీడియా సాక్షి అనే చెప్పాలి. తెలుగువాడి ఆత్మసాక్షి అనే స్లోగన్ తో పుట్టుకొచ్చిన సాక్షి కనీసం మనస్సాక్షి లేకుండా వార్తలు ప్రచారం చేస్తుంది, రాజకీయ కథనాలు వండి వడ్డిస్తుంది.
మీడియా ముసుగులో ప్రభుత్వం పై తప్పుడు ప్రచారాలు, అసత్య కథనాలు ప్రచారం చేస్తూ వీక్షకులను తప్పుదోవ పట్టించడంలో సాక్షి మాస్టర్ డిగ్రీ పొందిందనే చెప్పాలి. సదరు మీడియాలో నాణానికి ఒకవైపే అన్నట్టుగా మీడియాలో ప్రశ్న అడిగే వాడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పేవాడు కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తే అయిఉంటాడు.
వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఎవరైనా ఒక్కమాట మాట్లాడినా, చివరికి అది సొంత తల్లైన, చెల్లైనా సాక్షి అందుకు మినహాయింపు ఇవ్వదు, వారి పై కరుణ చూపించదు. అలాగే వైసీపీ పార్టీ రాజకీయానికి పనికొస్తే అది రౌడీ అయినా కరుడుకట్టిన నేరస్తుడైన సాక్షి కి సాక్ష్యాలు కావాల్సిందే.
అందుకు తాజాగా సాయికృష్ణ వివాదం పై సాక్షిలో వచ్చిన కథనాలే చక్కటి ఉదాహరణలు కాగా మరొకటి సాక్షాత్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుల కుమార్తె, జగన్ సొంత చెల్లి షర్మిల జగన్ ను రాజకీయంగా ప్రశ్నించిన పాపానికి ఆమె పుట్టుక మీద కూడా సాక్షి లో నీచాతి నీచమైన డిబేట్లు జరిగాయి.
ఇక తల్లి విజయలక్ష్మి, జగన్ తన కుమార్తె పిల్లలకు ఆర్థిక నష్టం చేస్తున్నారు అంటూ వాపోయినందుకు, జగన్ ఆస్తుల కోసం తల్లి విజయలక్ష్మి మీద వేసిన కేసులకు బదులు చెప్పినందుకు విజయమ్మను కూడా పసుపు సైన్యంలో కలిపేసి బాబు మనిషిగా ముద్రవేసిన చరిత్ర సాక్షి సొంతం.
ఇక రాష్ట్ర రాజధాని అమరావతి పై సాక్షిలో వచ్చే అసత్య ప్రచారాలు, తప్పుడు కథనాలు ఎండింగ్ లేని సీరియల్ స్టోరీ నే అనిచెప్పొచ్చు. అమరావతి ఒక ముంపు ప్రాంతమని, వర్షాలతో అమరావతి మునిగిపోతుంది, అమరావతి నిర్మాణాల వ్యయం ఇన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు అంటూ సామాన్యుడి మదిలో అనేక అనుమానాలు సృష్టించేందుకు సాక్షి ఎన్నడూ వెనుకాడలేదు.
అలాగే పార్టీ అధినేత వైఎస్ జగన్ సభలకు గ్రాఫిక్స్ లో క్యాడర్ ని యాడ్ చెయ్యగలిగిన ఘనత కూడా సాక్షికే దక్కింది. ఇలా వైసీపీ కోసం నిత్యం విలవిలలాడే సాక్షి వైసీపీ అనుకూల వార్తలు ప్రచారం చెయ్యడం తప్పుకాదు కానీ ప్రతి వార్తను వైసీపీ కి అనుకూలంగా మలచాలి అని తాపత్రయ పడడం మాత్రం ముమ్మాటికీ తప్పే.
ఇక బాబు, పవన్, లోకేష్ కేంద్రంగా సాక్షిలో జరిగే తిట్ల దండకాలకు కొదవే ఉండదు. ఒక వార్తను వైసీపీ పార్టీ కి అనుకూలంగా మలచి దాన్ని ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లేందుకు వైసీపీ పార్టీకి సాక్షి ఎంతో సాయపడుతుంది. 2019 వైసీపీ గెలుపులోనూ 2024 వైసీపీ ఓటమిలోను సాక్షి పాత్ర కీలకం అనేది జగమెరిగిన సత్యమే.
వైసీపీ చేస్తున్న రప్ప రప్ప రాజకీయాలను కూడా శాంతి సందేహాలుగా మార్చే శక్తి, ఇక వైసీపీ నేతల బూతు రాజకీయాలను కూడా చాగంటి గారి ప్రవచనాలుగా ప్రచారం చెయ్యాలిగిన సత్తా, రాజధాని అమరావతి మీద నీలి నీడలు కమ్మగల సత్తువ సాక్షి సొంతం.
అలాగే వైసీపీ లిక్కర్ కేసులో అరెస్టయిన నేతలను మంచివాళ్ళుగా, ప్రత్యర్థి పార్టీ కేంద్రాలయాల మీద దాడులకు పాల్పడినవారిని అందగాళ్లుగా, వేల కోట్ల అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న వారిని సౌమ్యులుగా, రాష్ట్ర ముఖ్యమంత్రిని లకారాలతో దూషించినవారిని కుల టైగెర్లుగా ప్రచారం చేసే సాక్షి లేకుండా వైసీపీ రాజకీయం చెయ్యగలదా.? మనుగడ సాధించగలదా.?
Ishan Kishan could be back in India’s Test plans ahead of the upcoming New Zealand…
Kangan Baruah brings a flash of metallic glamour to this striking portrait series. Her silver…