
ఇతని కొత్త మూవీ కిసీకా భాయ్ కిసీకా జాన్ రంజాన్ పండగ సందర్భంగా 21న రిలీజ్ కానుంది. పెద్దగా హైప్ లేదు. టీజర్ మీద కామెంట్స్ వచ్చాయి. లిరికల్ వీడియోలో సల్మాన్ స్టెప్పులు ట్రోలింగ్ కు గురయ్యాయి. జులపాల జుత్తుతో పెట్టుకున్న విగ్గు గురించి ఆన్ లైన్ కామెడీ చాలానే జరిగింది. ఇంతా చేసి ఇది అజిత్ వీరం రీమేకట. అంటే పవన్ కళ్యాణ్ కాటమరాయుడన్న మాట. బయటికి చెప్పలేదు కానీ ఆ కథనే తీసుకుని నానా మార్పులు చేసి ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ ఉండేలా జాగ్రత్త పడ్డారట. అవేంటో థియేటర్ కెళ్తే కానీ తెలియదు.
ఇందులో పూజా హెగ్డే ఉంది. మన దగ్గర సీనియర్ హీరోలతో చేయడానికి బెట్టు చేస్తుంది కానీ యాభై దాటిన సల్మాన్ అనగానే ఎగిరి గంతేసి ఒప్పుకుంది. ఆమెకు అన్నయ్యగా నటించింది విక్టరీ వెంకటేష్. స్క్రీన్ స్పేస్ పరంగా ప్రాధాన్యం పెద్దదే. ఒక పాటలో రామ్ చరణ్ తళుక్కున మెరిసి డాన్స్ చేసేలా మరో ట్విస్టు పెట్టారు. పవన్ కళ్యాణ్ ఖుషి హీరోయిన్ భూమికని వెంకీకి జత కట్టించారు. ఈ ఇద్దరి కాంబోలో అప్పట్లోనే వాసు అనే ఫ్లాప్ మూవీ వచ్చింది. సీతమ్మవాకిట్లో బామ్మ రోహిణి హట్టంగడి, టాలీవుడ్ బ్రాండ్ విలన్ జగపతిబాబు, మాళవిక శర్మ ఇలా మన గ్యాంగ్ పెద్దదే ఉంది. వెంకీ, చరణ్, పూజాలు కలిసి ప్రేక్షకులను ఫుల్ చేస్తారనే నమ్మకం కాబోలు.
చూస్తుంటే నార్త్ కంటే దక్షిణాది మార్కెట్ నే ఎక్కువ టార్గెట్ చేసుకున్నట్టు ఉంది. ఎంత మన క్యాస్టింగ్ ఉన్నా హీరో సల్మాన్ ఖానే కాబట్టి మనకు హిందీ మూవీ లాగే కనిపిస్తుంది. అందుకే టీమ్ చాలా తెలివిగా ట్రైలర్లు పాటల్లో తెలుగు మొహాలే ఎక్కువ హైలైట్ అయ్యేలా చూసుకుంటోంది. ఆర్ఆర్ఆర్, పుష్ప ఎఫెక్ట్ కావొచ్చు లేదా ఇక్కడా వర్కౌట్ చేసుకునే ఎత్తుగడ కావొచ్చు. ఏది ఏమైనా రంజాన్ పండక్కు ఓ రేంజ్ లో రచ్చ చేసే సల్లు భాయ్ ఈసారి తెలుగు గ్యాంగ్ మీదే ఆధారపడ్డాడు. అన్నట్టు దీని దర్శకుడు ఫర్హద్ సంజి గత సూపర్ ఫ్లాప్ బచ్చన్ పాండే కూడా గద్దలకొండ గణేష్ రీమేక్ కావడం చివరి ట్విస్టు.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…