Telugu

మహేష్ మరోటి విడుదల చేస్తున్నాడు!

ప్రిన్స్ మహేష్ బాబు విడుదల చేసిన “స్పైడర్” టీజర్ తో ప్రిన్స్ మహేష్ బాబు అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఒకటికి పది సార్లు ఆ టీజర్ ను చూసుకుంటూ పండగ చేసుకుంటున్నారు. ఇక ఇప్పట్లో మహేష్ సినిమాకు సంబంధించి కొత్తగా విడుదల చేసే అంశాలు ఏవీ లేవు. సెప్టెంబర్ నెలాఖారున విడుదల కావడంతో, బహుశా మళ్ళీ మహేష్ పుట్టినరోజుకే ఎలాంటి హంగామా అయినా ఉండొచ్చు.

అయితే తన సినిమాలతో పాటు తన బావ సుధీర్ బాబుకు సంబంధించిన చిత్రాలకు కూడా ప్రమోషన్ చేసే ప్రిన్స్ సోషల్ మీడియా ఖాతా నుండి జూన్ 2వ తేదీన ఓ ట్వీట్ రాబోతోంది. సుధీర్ బాబు తాజాగా నటిస్తోన్న “శమంతకమణి” సినిమాలో సుధీర్ క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేయనున్నాడు ప్రిన్స్. మల్టీస్టారర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇటీవలే నారా రోహిత్, ఆదిల ఫస్ట్ లుక్స్ విడుదలయ్యాయి.

ADVERTISEMENT

తాజాగా శుక్రవారం నాడు మూడవ పోస్టర్ గా సుధీర్ బాబు లుక్ ను మహేష్ సాయంత్రం అయిదు గంటలకు విడుదల చేయబోతున్నాడు. ఈ విషయాన్ని సుధీర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా తెలిపారు. దీంతో ‘స్పైడర్’ టీజర్ విడుదల చేసిన మరుసటి రోజు సుధీర్ బాబు రూపంలో, మహేష్ నుండి మరో ట్వీట్ రాబోతోందన్న మాట. ప్రిన్స్ నుండి ట్వీట్ రావడంతో ‘శమంతకమణి’ చిత్ర యూనిట్ కూడా ఫుల్ ఖుషిలో ఉంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Romanchakam Review: U.S. Premiere Report

Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…

55 minutes ago

Ravi Teja Gave More Confidence To Jr NTR?

Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…

5 hours ago