
ఇది భారత ప్రభుత్వ రహస్య ఏజెన్సీలో పనిచేసే ఒక మధ్యతరగతి వ్యక్తి యొక్క కథ మరియు అదే సమయంలో తన వ్యక్తిగత జీవితంలో వచ్చే ఇబ్బందుల గురించి జరిగే కథ. ఈ వెబ్ సిరీస్ రెండవ భాగం సెప్టెంబర్‌లో విడుదల అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కోసం తన డైలాగ్స్‌ను హిందీలో తొలిసారిగా డబ్ చేసినట్లు నటి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
“నేను ఫ్యామిలీ మ్యాన్ 2 లో హిందీ మాట్లాడుతున్నాను. నాకు దక్షిణ భారతీయ సినిమాల యాసలో నటించడం అలవాటు అయినందున హిందీ యాస విషయంలో కొంత ఇబ్బంది పడాల్సి వచ్చిందని ఈ నటి అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా కోసం వెబ్‌నార్‌లో వెల్లడించింది.
ఇక పోతే… నిరుడు వచ్చిన ఓ బేబీ తరువాత సమంతా తన తదుపరి చిత్రం ప్రకటన చెయ్యలేదు. ఒకటి రెండు ద్విభాషా చిత్రాలు సైన్ చేసినట్టు వార్తలు మాత్రం వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్ గా చెయ్యబోతుందని పుకార్లు వ్యాపించాయి. అదే జరిగితే ఎన్టీఆర్ సమంతాల కాంబినేషన్ లో అది ఐదవ సినిమా.
స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ గెలిచే అవకాశం లేదని జగన్ ముందే చెప్పేశారు. కానీ పార్టీ శ్రేణుల చేత వీర…
Janhvi Kapoor’s role in Ram Charan’s Peddi is back in discussion after Karan Johar brought…