
[m9ad]
అయితే ఈ క్రమంలోనే గతంలో రాజుగది-2లో ఒక ప్రత్యేక పాత్ర చేసిన సమంత తాజాగా యూ-టర్న్ సినిమాలో కూడా తన చుట్టూ తిరిగే పాత్రనే నటించి అందరినీ మెప్పించింది. అయితే అలాంటి పాత్రలు మంచి హిట్ అవుతున్నాయి అన్న ఆలోచనో, లేక అలాంటి పాత్రల వల్ల పెద్దగా రిస్క్ ఉండదు అన్న ఆలోచనో తెలీదు కానీ, ఇలాంటి సినిమాలను చేసేందుకే సమంత ఎక్కువగా ఆలోచన చేస్తుందా? అంటే అవును అనే చెప్పవచ్చు. అసలు మ్యాటర్ ఏంటి అంటే త్వరలో సమంత ఒక బామ్మ పాత్రలో కనిపించేందుకు సిద్దం అయిందట. అయితే ఈ సినిమాలో పూర్తిగా బామ్మగా మారిపోతుందా? లేదా అన్న విషయం కాస్త గమనిస్తే, ‘మిస్ గ్రానీ’ అనే కొరియన్ సినిమా ఆధారంగా తెరకెక్కుతుంది ఈ సినిమా. ఈ సినిమాకు ‘అలా మొదలయింది’ సినిమా డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. అయితే ఒక సంఘటన తరువాత అరవై ఏళ్ల బామ్మ ఇరవై ఏళ్ల అమ్మాయిలో ప్రవేశించి చేసే హంగామా, అల్లరి ఈ సినిమా కధగా చెబుతున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఆ రెండు పాత్రల్లో నటించేది సమంతనే అని తెలుస్తుంది. మంచి హారర్ లాంటి థ్రిల్లర్ గా దీన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం శివ నిర్వాన దర్శకత్వంలో భర్త నాగ చైతన్యతో కలసి ‘మజిలీ’లో నటిస్తున్న ఆమె, ఈ నెల ఆఖరుకి ‘మిస్ గ్రాని’గా మారనుంది అని టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న వార్త. మరి త్వరలో బామ్మగా మారబోతున్న సమంత ఈ సినిమాతో ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.
The Supreme Court’s hearing on the Andhra Pradesh municipal elections could change the fate of…
Chiranjeevi is reportedly preparing to enter a new space with his talk show MEGAVerse for…