
సమంతకు సంబంధించి మరో వార్త నెట్టింట జోరుగా వైరల్ అవుతోంది. అదేంటంటే ఆమె ఓ స్కిన్ డిసీస్‌తో బాధపడుతుందని, అందువల్లనే షూటింగ్స్‌లో ఆమె పాల్గొనటం లేదని.. చికిత్స కోసం అమెరికాకు వెళుతుందని సదరు వార్తల సారాంశం. అయితే ఇవే వార్తలు కొన్ని రోజుల ముందు చక్కర్లు కొట్టినప్పుడు సమంత మేనేజర్ రియాక్ట్ అయ్యి.. సామ్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు మళ్లీ అవే వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఒకవేళ ఈ వార్తల్లో నిజం లేదనే అనుకుందాం. అయితే ఇక్కడ సగటు సినీ ప్రేక్షకుడికి అర్థం కానీ ప్రశ్నలు ఉన్నాయి. అవేంటంటే.. ఆ మధ్యలో ఓ ఆశ్రమంలో ఉన్న సమంత ఫొటో బయటకు వచ్చింది. అందులో ఆమె డల్‌గా కనిపించటంతో అందరిలో ముందు అనుమానాలు మొదలయ్యాయి. అలాగే పాన్ ఇండియా మూవీ అని చెప్పుకుంటోన్న యశోద సినిమా రిలీజ్ ఎందుకు పోస్ట్ పోన్ అయ్యింది. దీనికి సమంత డబ్బింగ్ చెప్పడానికి రాకపోవటం వల్లనే అనేది బయట వినిపిస్తోన్న టాక్. అలాగే ఖుషి సినిమా ఎందుకు ఆగిపోయిందో ఎవరూ చెప్పటం లేదు. అయితే సమంత షూటింగ్‌కి రాకపోవటం వల్లనే ఆగిపోయిందనేది మరో వార్త. ఇలాంటి న్యూస్‌కి ఆన్సర్ ఇవ్వాల్సిన కనీస బాధ్యత స్టార్స్‌పై ఉంటుంది. రియాక్ట్ కాకపోతే సమస్య పెరుగుతుందే కానీ.. తగ్గదు.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…