
వరంగల్ లోని హన్మకొండలో ఓ షాపు ఓపెనింగ్స్ కార్యక్రమానికి విచ్చేసిన సమంతను పలకరించడానికి అశేష ప్రజానీకంతో పాటు మీడియా వర్గీయులు కూడా చేరుకున్నారు. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసుపై తన అభిప్రాయాన్ని కూడా చెప్పాల్సిందిగా సమంతను కోరగా, దానికి ‘నో కామెంట్’ అన్న జవాబు రావడంతో, డ్రగ్స్ కేసుపై స్పందించడానికి సమంత సైతం నీళ్ళు నములుతోందన్న విషయం మీడియా వర్గీయులకు తెలిసివచ్చింది.
తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఏమీ దాచుకోకుండా, అంతా ఓపెన్ గా గలగలా మాట్లాడుతుందేమో గానీ, ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల గురించి గానీ, ఇండస్ట్రీకి చెందిన అంశంపై గురించి గానీ స్పందించడానికి కాస్త ఆలోచించాల్సిందే అనే విధంగా సమంత వ్యవహార తీరు ఉందని ఈ సంఘటన చెప్పకనే చెప్తోంది. బహుశా ‘1 నేనొక్కడినే’ పోస్టర్ పై తాను చేసిన కామెంట్ రీత్యా నేర్చుకున్న పాఠమో గానీ, మొత్తానికి డ్రగ్స్ అంశంపై స్పందించి తనను ఇరికించవద్దని చెప్పకనే చెప్పింది.
The Tiger Shroff firing incident appears to have changed more than just the security arrangements…
Andhra Pradesh's urban local body elections saw a mixed voter response. While some municipalities recorded…