
ఇప్పటికే విడుదలైన యశోద సినిమా పోస్టర్ కు వినూత్న స్పందన రావడం పై చిత్ర యూనిట్ తమ ఆనందాన్ని పంచుకున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకం పై నిర్మించిన యశోద సినిమా తెలుగుతో పాటుగా తమిళ,కన్నడ,మలయాళం,హిందీ భాషలలో ఏకకాలంలో విడుదల చేస్తామన్నారు. ఈ సినిమాకు హరి – హరీష్ లు దర్శకులుగా పరిచయం అవుతున్నారు.
హైద్రాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్ర బృందం., మే నెలాఖరుకు చిత్రీకరణ అంతా పూర్తి చేసుకుని సినిమాను అనుకున్న తేదికి విడుదల చేస్తామన్నారు. అయితే అక్కినేని కుటుంబంతో వైవాహిక బంధాన్ని తెంచుకున్న సమంత, అక్కినేని వారసులతో ‘సినిమా వార్’ షురూ చేసినట్లుంది అంటూ సినిమా సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది.
అమీర్ ఖాన్ – నాగచైతన్య., కలసి నటిస్తున్న లాల్ సింగ్ చద్దా…, సినిమా ఆగస్టు 11న విడుదల కాగా., అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ ఆగష్టు 12న విడుదలకు సిద్ధంచేస్తున్నట్లు చిత్రబృందాలు తెలిపాయి. సమంత యశోద సినిమా కూడా అదే తేదీన రిలీజ్ కు రెడీ కావడంతో ‘సమంత’ వర్సెస్ ‘అక్కినేని’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
Ravichandran Ashwin believes India's decision to pick Naman Dhir over Tamil Nadu Star Washington Sundar…
Ram Pothineni is taking on two roles for his neo-noir psychological action thriller #RAPO23. Marking…