
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సమంత తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. తన వ్యక్తిగత జీవితం గురించి అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమంత తనదైన శైలిలో బదులిచ్చారు.
మీరు జీవితంలో చేసిన అతిపెద్ద తప్పేంటి అంటూ పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నకు శ్యామ్ ఇలా బదులిచ్చారు. “నా ఇష్టాఇష్టాలను గుర్తించలేకపోవడమే నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పని” దానిని చాల ఆలస్యంగా నేను తెలుసుకున్నానంటూ సమాధానమిచ్చారు.
గతంలో నా భాగస్వామి నా ఇష్టాలను ప్రభావితం చేసారని, అటువంటి కష్ట సమయంలోనే ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నానంటూ తన వైవాహిక బంధం గురించి పరోక్షంగా అభిమానులకు వెల్లడించారు సమంత.
తన సినిమాల వరుస ప్లాపులు, ఆర్యోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటున్న సమంత సినిమాలను తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. అయితే సోషల్ మీడియా వేదికగా మాత్రం తన అభిమానులకు ఎప్పుడు చేరువలోనే ఉంటారు సమంత.
అలాగే తాజగా సంక్రాంతి సూపర్ హీరోగా నిలిచిన హనుమాన్ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియచేసారు. గతంలో ఓ బేబీ సినిమాలో సమంత క్యారక్టర్ కు మనవడిగా నటించిన తేజ సజ్జ నటన పై ప్రశంసలు కురిపించి హనుమాన్ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నా అంటూ ట్విట్ చేసారు సమంత.
ఢిల్లీలో సీజేపీ ఆందోళనలకు సోషల్ మీడియా ద్వారా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. అందుకు సీజేపీ నేతలు…
Prithvi Shaw has opened up about dealing with social media backlash, mistakes from his past…