Telugu

ట్విట్టర్ లో సమంత ఫైర్!

శేఖర్ కమ్ముల “ఫిదా” చూసిన వారంతా ‘ఫిదా’ అవుతూ… తమ అనుభూతులను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తాజాగా “ఫిదా” సినిమా వీక్షించిన టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత, “సినిమా చాలా ఫ్రెష్ ఉంది, శేఖర్ కమ్ముల గారు స్వచ్చమైన ప్రేమను చూపించారు, హీరో వరుణ్ తేజ్ తో సహా చిత్ర బృందానికి మొత్తం కంగ్రాట్స్” అంటూ ట్వీట్ చేసింది.

ADVERTISEMENT

ఈ ట్వీట్ చూసి స్పందించిన నెటిజన్… ఈ సినిమా సూపర్ సక్సెస్ కు ప్రధాన కారణమైన సాయిపల్లవిని కూడా అభినందించాలి… అంటూ సమంత పాఠాలు నేర్పే విధంగా ట్వీట్ చేసాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సమంత… “నా మీద ఎటాక్ ముందు నేను చేసిన ట్వీట్స్ సరిగా చూడు” అంటూ ఘాటుగా స్పందించింది. దీంతో తన తప్పు తెలుసుకున్న నెటిజన్, ఫైనల్ గా తన అభిమాన హీరోయిన్ నుండి ఓ రిప్లై వచ్చిందని ‘వార్’కు శుభంకార్డ్ వేసాడు.

నిజానికి సాయిపల్లవిని అభినందించే ట్వీట్ నేరుగా కాకుండా, ‘ట్వీట్ అండ్ రిప్లైస్’లో మాత్రమే కనపడుతుండడంతో, ముందుగా సదరు నెటిజన్ దీనిని గమనించకుండా సమంతకు ట్వీట్ చేసేసాడు. ఆ తర్వాత తన పొరపాటును కాస్త తెలివిగా సమర్ధించుకున్నాడు. అయితే ఈ సందర్భంగా సాయిపల్లవి సినిమాల్లోకి రాక ముందే సమంత చేత అభినందనలు అందుకున్న ఓ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Toxic: Yash Not Even Sparing X Users? More Negativity

A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…

11 minutes ago

కేసీఆర్‌ ఎదురు చూస్తున్న ఆ ఘడియలు వచ్చేశాయా?

కాంగ్రెస్‌ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్‌ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…

18 minutes ago